English   

అంతుపట్టని అల్లు అర్జున్ వ్యూహం

allu-arjun
2018-05-24 08:07:22

అల్లు అర్జున్.. మెగా హీరోగా పరిచయమైనా తనకంటూ సెపరేట్ గుర్తింపు తెచ్చుకున్నాడు. వరుస విజయాలతో తనదైన మార్కెట్ ను ఏర్పాటు చేసుకున్నాడు. అటు మళయాలంలోనూ టాలీవుడ్ నుంచి టాప్ మార్కెట్ ఉన్న హీరోగా పేరు తెచ్చుకున్నాడు. స్టైలిష్ స్టార్ గా జాతీయస్థాయిలోనూ గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ తర్వాత ఏం చేయబోతున్నాడు.. ఇదే ఇప్పుడు ఎవరికీ అంతుబట్టని విషయం అయిపోయింది. నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా అంచనాలను అందుకోలేకపోయింది. అయినా బన్నీ ఎఫర్ట్స్ ను అంతా మెచ్చుకున్నారు. కానీ సినిమా పోయింది.. కెరీర్ లో ఇవన్నీ కామన్. కానీ అసలు అల్లు అర్జున్ నెక్ట్స్ ఏం చేయబోతున్నాడు. ఇదే ఎవరికీ తెలియకుండా పోయింది. 

నిజానికి ఇప్పుడున్న మన స్టార్స్ అంతా ఒక సినిమా చేస్తుండగానే మరో సినిమా లైన్లో పెడుతున్నారు. మరికొందరైతే ఏకంగా 2020వరకూ బిజీ షెడ్యూల్ తో ఉన్నారు. ఈ లిస్ట్ లో లేని ఏకైక స్టార్ అల్లు అర్జున్. మరి అతను ఏతరహా సినిమా చేయాలనుకుంటున్నాడు. ఏ దర్శకుడితో కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేయబోతున్నాడు అనే విషయాలూ గోప్యంగా ఉంచుతున్నారు. ఇందుకు కారణాలేంటో తెలియదు కానీ.. బన్నీ మాత్రం  కెరీర్ కు సంబధించి ఫస్ట్ టైమ్ ఇంత లో ప్రొఫైల్ మెయిన్టేన్ చేస్తున్నాడు. 

కొరటాల శివతో సినిమా అనే రూమర్స్ వచ్చాయి. విక్రమ్ కుమార్ తో చేస్తున్నాడు అన్నారు.. కానీ ఈ రెండు వార్తల్లో ఇటు బన్నీ నుంచే కాదు ఆ దర్శకుల నుంచి కూడా ఎలాంటి రెస్పాన్స్ లేదు. ఇది ఆయన అభిమానులనే కాదు.. పరిశ్రమను సైతం ఆశ్చర్యపరుస్తోంది. మరోవైపు ముంబైలో కొత్త పీఆర్ టీమ్ ను ఫామ్ చేసుకున్నాడు. ఒకవేళ బాలీవుడ్ సినిమా ఏమైనా చేస్తున్నాడా అని ఆరాలు తీసేవారూ ఉన్నారు. ఎందుకంటే అల్లు అర్జున్ డబ్బింగ్ సినిమాలకు బాలీవుడ్ ఫుల్ గిరాకీ ఉంది. అతని సరైనోడు సినిమానే ఇప్పటి వరకూ హయ్యొస్ట్ రేటింగ్ తెచ్చుకున్న డబ్బింగ్ సినిమా. అలాగే ఎక్కువమంది చూసిన తెలుగు డబ్బింగ్ సినిమా కూడా ఇదే. అయితే బాలీవుడ్ సినిమా చేస్తున్నట్టు కూడా కనపించడం లేదు. మరి బన్నీ ఏం చేస్తున్నాడు.. ఏం చేయబోతున్నాడు.. ఎప్పుడు చేస్తాడు..? ఇవన్నీ ఇప్పటికైతే ఆన్సర్ లేని క్వశ్చన్స్ గానే మిగిలిపోనున్నాయి.. దీంతో అసలు అల్లు అర్జున్ కెరీర్ వ్యూహం ఏంటనేది ఎవరికీ అంతుపట్టడం లేదు. 

More Related Stories