English   

బాహుబలి వెనక మనకి తెలియని నిజాలు.. హీరో ప్రభాస్ కాదంట..

rajamouli
2020-07-11 16:28:27

బాహుబలి.. ప్రైడ్ ఆఫ్ తెలుగు సినిమా అనేకంటే కూడా ఇండియన్ సినిమా అనాలేమో..? ముందు తెలుగు సినిమాగానే మొదలై ఆ తర్వాత ప్రపంచ సినిమాలో తెలుగు ఇండస్ట్రీకి కూడా ఓ పేజీని లింఖించేలా చేసాడు రాజమౌళి. ఐదేళ్ల పాటు ఈ యజ్ఞం చేసాడు దర్శక ధీరుడు. జులై 10తో ఈ సినిమా విడుదలై ఐదేళ్లు పూర్తి చేసుకుంది. నిన్నగాక మొన్నొచ్చినట్లు అనిపిస్తున్నా కూడా అప్పుడే బాహుబలి వచ్చి 5 ఏళ్లు గడిచిపోయింది. అయితే ఈ బాహుబలి సినిమా తెరకెక్కడం వెనక ఎన్నో ఏళ్ల కృషి ఉంది. కొన్నేళ్ల శ్రమ దాగుంది. ఇక్కడ మరో విశేషం కూడా ఉందండోయ్. బాహుబలి అంటే ఈ రోజు మనం ప్రభాస్ అనుకుంటున్నాం కానీ దానికంటే ముందు కూడా మరో హీరోను అనుకున్నాడు రాజమౌళి. 

అంతేకాదు సినిమాలో ప్రతీ పాత్రకు మరొకర్ని అనుకున్న తర్వాత చివరికి వీళ్లు సెట్ అయ్యారు. అయితే ప్రభాస్ తో పాటు చాలా మంది ఈ సినిమాలోకి అనూహ్యంగా వచ్చారు. చత్రపతి సమయం నుంచే తన కొడుకును రాజుగా చూడాలనుకుంటున్నానని ప్రభాస్ తండ్రి సూర్యనారాయణ రాజు చెప్పేవాడని.. దాంతో అప్పటి నుంచి కూడా తన బుర్రలో కూడా ఈ ఆలోచన ఉండిపోయిందని చాలాసార్లు చెప్పాడు రాజమౌళి. ఇదిలా ఉంటే బాహుబలి కథ అనుకున్న తర్వాత హిందీలో చేయాలనుకున్నాడు రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్. కానీ ఆ తర్వాత అనుకోకుండా మన వాళ్లతోనే ఈ చిత్రం చేసాడు. అయితే ఈ చిత్రం వెనక ఉన్న అసలు నిజాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రభాస్: ఈ సినిమాలో ప్రభాస్ పాత్ర కోసం ముందుగా బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్‌ను అనుకున్నారు. బాహుబలిగా ఆయన్నే తీసుకోవాలనుకున్నా కథ రివర్స్ అయింది.

రానా: బళ్లాల దేవుడి పాత్ర కోసమే పుట్టినట్లు అందులో ఒదిగిపోయాడు రానా దగ్గుబాటి. కానీ ఆయన కంటే ముందు ఈ పాత్రకు జాన్ అబ్రహాంను అనుకున్నారు.

శివగామి: సినిమాలో కీలకమైన శివగామి పాత్ర కోసం ముందు శ్రీదేవితో పాటు మంచు లక్ష్మిను అనుకున్నాడు రాజమౌళి.

అవంతిక: తమన్నా పోషించిన అవంతిక పాత్ర కోసం ముందు సోనమ్ కపూర్ పేరు పరిశీలించాడు దర్శక ధీరుడు.

కట్టప్ప: బాహుబలిలో అత్యంత కీలకమైన కట్టప్ప పాత్రకు సత్యరాజ్ ప్రాణం పోసాడు. కానీ ఈ పాత్ర కోసం ముందు మోహన్ లాల్‌ను అనుకున్నా అన్నేళ్లు డేట్స్ ఇవ్వలేక వదిలేసుకున్నాడు ఈ మలయాళ సూపర్ స్టార్. 

More Related Stories