English   

నా బెస్ట్ ఫ్రెండ్ ఓ ట్రాన్స్ జెండర్..ఉపాసన ఆసక్తికర వ్యాఖ్యలు

Upasana
2020-10-24 16:22:26

మెగా పవర్ స్టార్ రాంచరణ్ భార్య, అపోలో ఎండీ ఉపాసన కొణిదెల చాలా సింపుల్ జీవితాన్ని గడుపుతూ మహిళలకు ఆదర్శవంతంగా ఉంటారు. ఉన్నతమైన కుటుంబంలో జన్మించిన ఉపాసన ఎప్పుడూ సామాజిక అంశాలపై తన గళాన్ని వినిపిస్తుంది. అంతే కాకుండా చారిటీ ద్వారా కూడా ఆమె అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఉపాసన హెల్త్&ఫిట్ నెస్ టిప్స్ ను  కూడా అభిమానులకు అందిస్తుంది. అంతే కాకుండా ఇటీవల "యువర్ లైఫ్" పేరుతో ఉపాసన ఓ హెల్త్ కి సంబందించిన వెబ్ పోర్టల్ ను కూడా ప్రారంభించింది. ఈ ప్లాట్ ఫామ్ ద్వారా ఉపాసన ఆరోగ్యకరమైన ఆహారం మరియు ఫిట్నెస్ టిప్స్ ను అందిస్తోంది. ఇప్పటికే ఈ షో కోసం నటి సమంతతో కలిసి రెండు వంటకాలను కూడా షేర్ చేసింది. అంతే కాకుండా సమంత జిమ్ వర్కౌట్స్ ఫోటో షూట్ ను కూడా పంచుకుంది. 

ఇదిలా ఉండగా తాజాగా ఉపాసన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఆ ఇంటర్వ్యూకి సంబందించిన ప్రోమో విడుదల కాగా తక్కువ సమయంలోనే ఎక్కువ లైక్స్, వ్యూస్ వస్తున్నాయి. వీడియోలో ఉపాసన మాట్లాడుతూ.. ఇప్పుడు తన బెస్ట్ ఫ్రెండ్ ఒక ట్రాన్స్ జెండర్ అని వెల్లడించింది. మరోవైపు మహిళలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని, మహిళలను గౌరవించని ఇంట్లో దేవికి పూజలు చేయకూడదని, ఫోటోలను కూడా పెట్టకూడదని తెలిపింది. కాగా ఉపాసన చేసిన ఆసక్తికర వ్యాఖ్యలతో ఈ వీడియో వైరల్ అవుతోంది. మహిళలు ఉపాసన వీడియో చాలా బాగుందటూ పొగుడుతున్నారు.

More Related Stories