English   

ఉప్పెన ట్రైలర్ టాక్..ప్రేమ చరిత్రలోనే వుంటది..భవిష్యత్తు ఉండదు

Uppena
2021-02-04 16:38:02

మెగా మేనల్లుడు సాయిధరమ్‌ తేజ్‌ సోదరుడు వైష్ణవ్‌ తేజ్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం  ఉప్పెన. వైష్ణవ్‌ తేజ్ సరసన కృతిశెట్టి కథానాయికగా నటిస్తోంది. డైరెక్టర్‌ సుకుమార్‌ శిష్యుడు బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా విడుదల అయిన ట్రైలర్ విశేషంగా ఆకట్టుకుంటోంది. సముద్రతీర ప్రాంతంలోని గ్రామంలో ఓ పేదింటి అబ్బాయికీ, ఓ సంపన్న కుటుంబానికి చెందిన అమ్మాయికీ మధ్య ఏర్పడే ప్రేమ ఎలాంటి పరిణామాలకు దారి తీసిందనే పాయింట్‌తో ఈ చిత్రం ఉంది.  

'ప్రేమంటే పట్టుకోవడం.. వదిలేయడం కాదు..' అని కృతి శెట్టి చెప్పిన డైలాగ్  అలాగే 'ప్రేమ గొప్పదైతే చరిత్రలోనో సమాధుల్లోనో కనపడాలి కానీ పెళ్లి చేసుకుని పిల్లల్ని కని ఇళ్లల్లో కనబడితే దాని విలువ తగ్గిపోదూ.. అందుకే ప్రేమ ఎప్పుడూ చరిత్రలోనే ఉంటది.. దానికి భవిష్యత్తు ఉండదు' విజయ్ సేతుపతి చెప్పిన డైలాగ్స్ ట్రైలర్ లో హైలైట్ గా చెప్పవచ్చు.

ఇక ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు ఎంత హిట్‌ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటికే షూటింగ్‌ పూర్తైన ఈ చిత్రం వాలంటైన్స్‌ డేకు రెండు రోజుల ముందుగా అంటే ఫిబ్రవరి 12న థియేటర్లలో విడుదల కానుంది.రాక్‌స్టార్‌ దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని  మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్‌ రైటింగ్స్‌ బ్యానర్‌పై నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌ నిర్మించారు.మరి పాటలను ఆదరించిన ప్రేక్షకులు సినిమాను ఎంతవరకు ఆదరిస్తారో చూడాలి.

More Related Stories