English   

ఈ న‌గ‌రానికి ఏమైంది అంటున్న కొర‌టాల‌..

Koratala-Siva
2018-12-07 20:48:28

అదేంటి.. ఆ డైలాగ్ త‌రుణ్ భాస్క‌ర్ ది క‌దా అనుకుంటున్నారా..? ఆయ‌న కామెడీగా తీసుక‌న్నాడు కానీ ఇప్పుడు ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ మాత్రం చాలా సీరియ‌స్ గా తీసుకున్నాడు ఈ విష‌యాన్ని. ఎందుకంటే ఓటింగ్ శాతం చూసి ఆయ‌న‌కు క‌డుపు కాలిపోయింది. హైద‌రాబాద్ లో స‌గం పొద్దు పోయిన త‌ర్వాత కూడా క‌నీసం 35 శాతం ఓటింగ్ లేకపోవ‌డంతో కొర‌టాల ట్వీట్ చేసాడు. హైద‌రాబాద్ మీకేం అయింది.. ఈ న‌గ‌రానికి ఏమైంది.. అర్బన్ ఓటర్లను చూస్తే సిగ్గేస్తోంది అంటూ ట్వీట్ చేసాడు. ఈయ‌న కేవ‌లం ద‌ర్శ‌కుడిగానే తెలుసు కానీ అప్పుడ‌ప్పుడూ ప్ర‌భుత్వానికి సెటైర్లు కూడా వేస్తుంటాడు. ఇప్పుడు కూడా ఇదే చేసాడు. ఎన్నికల పోలింగ్ జరుగుతున్న వేళ ఓట్లు వేయ‌డానికి రాని వాళ్లంతా ఎందుకున్నారు అంటూ ప్ర‌శ్నించాడు. ఈ రోజు కూడా సోమ‌రిత‌నంతో ఉంటే ప‌నికిరాదంటూ చివాట్లు పెట్ట‌టాడు. ఓటు హ‌క్కు వినియోగించుకోవ‌డం కోసం ప‌ట్నాల నుంచి ప‌ల్లెల‌కు జ‌నాలు పోతుంటే.. ఇక్క‌డే ఉన్న వాళ్లు మాత్రం ఓటు వేయ‌కుండా బ‌ద్ధ‌కించారు. హైద‌రాబాద్ లో ఈ సారి కేవ‌లం 42 శాతం మాత్ర‌మే ఓటింగ్ న‌మోదైంది. దాంతో కొర‌టాల శివ ట్వీట్ పెట్ట‌డంలో త‌ప్పేం లేదు క‌దా..! 

More Related Stories