English   

అదిరిపోయే అందాల ఊర్వ‌శి.. 

Urvashi-Rautela
2018-02-12 16:12:37

ఊర్వ‌శి రుతేలా.. తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఈ పేరుతో పెద్ద‌గా ప‌రిచ‌యం లేక‌పోవ‌చ్చు కానీ బాలీవుడ్ లో మాత్రం ఈ పేరుకు గిరాకీ ఎక్కువ‌. క‌థ కంటే అందాల ఆర‌బోత‌కే ఎక్కువ‌గా గుర్తింపు ఉంటుంద‌ని ఎప్పుడో గ్ర‌హించింది ఈ ముద్దుగుమ్మ‌. అందుకే ఎక్క‌డికి వ‌చ్చినా కూడా అందాల‌నే న‌మ్ముకుని వ‌చ్చేస్తుంది. ఇప్ప‌టికే బాలీవుడ్ లో కొన్ని సినిమాలు చేసిన ఊర్వ‌శి.. ఇప్పుడు ప‌క్కా హాట్ సినిమాతో వ‌స్తుంది. ఈమె న‌టించిన హేట్ స్టోరీ 4 రిలీజ్ కు రెడీ అయింది. అందుకే ప్ర‌మోష‌న్స్ కు హాట్ హాట్ గా రెడీ అయి వ‌స్తుంది ఊర్వ‌శి. తొలి మూడు భాగాల కంటే ఇది ఇంకా హాట్ హాట్ గా ఉండ‌బోతుంద‌ని అర్థ‌మైపోతుంది. తొలి భాగంలో పాలి ధామ్.. రెండో భాగంలో సుర్వీన్ చావ్లా.. మూడోభాగంలో జ‌రైన్ ఖాన్.. వీళ్లంద‌రి కంటే ఇప్పుడు ఊర్వ‌శి మ‌రింత ఎక్కువ‌గానే అందాలు ఆర‌బోసింది. సినిమాలోనే అనుకుంటే బ‌య‌ట ఇంకా చంపేస్తుంది ఊర్వ‌శి త‌న అందంతో. ఎక్క‌డ చూసినా కూడా ఈ భామ అందాల ఆర‌బోతే క‌నిపిస్తుంది బాలీవుడ్ లో. అంత‌గా మాయ చేస్తూ ముందుకెళ్లిపోతుంది ఈ ముద్దుగుమ్మ‌. అన్న‌ట్లు తెలుగులోనూ న‌టించ‌డానికి సై అంటుంది ఊర్వశి రుతేలా. 

More Related Stories