English   

UV క్రియేషన్స్ సినిమాలో అనుష్క..అభిమానులకు సర్ ప్రైజ్

Anushka Shetty
2020-11-07 14:47:44

టాలీవుడ్ లో అచ్చమైన తెలుగమ్మాయిలా కనిపించే హీరోయిన్ అనుష్క. నాగచైతన్యకు యోగా టీచర్ గా వచ్చిన అనుష్క మన్మథుడు నాగార్జున కంట పడటంతో "సూపర్" సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశం దక్కించుకుంది. కాగా మొదటి సినిమాతో స్వీటీ కుర్రకారు మనసు దోచేసింది. ఆ తరవాత టాలీవుడ్ దాదాపు స్టార్స్ అందరి పక్కన నటించే ఛాన్స్ స్వీటీ కొట్టేసింది. మరోవైపు అనుష్క నటించిన ఎన్నో సినిమాలు కూడా ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ లు గా నిలిచాయి. అయితే మొదట్లో గ్లామర్ పాత్రలకే అనుష్క పరిమితమయ్యేది. బిల్లా సినిమాలో బికినిలో కనిపించి యువతకు మత్తెక్కించింది. దాంతో అనుష్క కు మంచి గ్లామరస్ హీరోయిన్ గా గుర్తింపు వచ్చింది. అయితే ఇప్పుడు మాత్రం అనుష్క కేవలం తన నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాల్లోనే నటిస్తోంది. ముఖ్యంగా ఎక్కువగా ఈ భామ లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేయడానికే మొగ్గు చూపిస్తోంది. 

అయితే అనుష్క వరుస పెట్టి లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేయడం కూడా ఆమెకు కొంత నష్టం తెచ్చిపెట్టింది. ఇటీవల విడుదలైన నిశ్శబ్దం కూడా అట్టర్ ఫ్లాప్ టాక్ రావడంతో అనుష్క లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు గ్యాప్ ఇవ్వనుందనే వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలను కొట్టిపారేస్తూ స్వీటీ మరో లేడీ ఓరియెంటెడ్ సినిమాకు ఒకే చెప్పింది. యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో సినిమా చెయ్యడానికి సైన్ చేసింది. ఈ సినిమాకు "రారా కృష్ణయ్య" సినిమా దర్శకుడు మహేష్ దర్శకత్వం చేయనున్నారు. అయితే ముందుగా ఓ హీరో తో కమర్షియల్ సినిమాలో నటించిన తరువాతే ఈ ప్రాజెక్ట్ మొదలు కానుందట. దానికి కారణం నిశ్శబ్దం సినిమా తరవాత వెంటనే లేడీ ఓరియెంటెడ్ సినిమాలో నటించకూడదని అనుష్క నిర్ణయించుకుందట.

More Related Stories