English   

సోలో బ్రతుకే సో బెటరూ అంటూనే పెళ్ళికి సిద్దమవుతున్న తేజూ

 Sai Dharam Tej
2020-05-05 11:44:50

దాదాపు అరడజను సినిమాల ఫ్లాప్ మీద ఫ్లాప్ కొట్టాక చిత్రలహరి అనే సినిమా ద్వారా తేజూ మళ్ళీ ట్రాక్ లో పడ్డాడు. ఆ తరువాత తెరకెక్కించిన ప్రతిరోజూ పండగే సినిమా ద్వారా మరో హిట్ కొట్టి మళ్ళీ మార్కెట్ లో నిలబడ్డాడు. ఇప్పుడు మనోడు హీరోగా సోలో బ్రతుకే సో బెటరూ అనే సినిమా తెరకెక్కుతోంది. సుబ్బు అనే కొత్త దర్శకుడు ఈ సినిమాని తెరకేక్కిస్తున్నాడు. ఈ సినిమా మే 1న విడుదల కావాల్సి ఉన్నా, ఇప్పుడు ఈ కరోనా వలన వాయిదా పడే అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నాయి. అయితే ఆ సంగతి పక్కన పెడితే మొన్ననే ప్రస్తానం లాంటి అవార్డ్ విన్నింగ్ సినిమాని తెరకెక్కించిన దేవా కట్టా డైరెక్షన్ లో ఒక సినిమా ఓపెనింగ్ జరిగింది. 

అయితే ఈ సినిమాల సంగతి పక్కన పెడితే ఇప్పుడు “సోలో బ్రతుకే సో బెటర్ ” అంటున్న సాయి తేజ్ త్వరలోనే పెళ్లి చేసుకోనున్నాడనే ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే ఆయన తాజాగా ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ .. తనకు 33 సంవత్సరాలు వచ్చేశాయని, పెళ్ళి చేసుకోమని ఇంట్లో వాళ్ళు గొడవ చేస్తున్నారని చెప్పుకొచ్చాడు. అంతే కాక ఈ సంవత్సరంలో తన పెళ్ళి జరగొచ్చని, ఇంట్లో వాళ్ళు సంబంధం వెతికే పనిలో ఉన్నారని ఆయన చెప్పుకొచ్చాడు. ఇక వాళ్ళు అదే పనిలో ఉన్నా తనకు అదృష్టం కలిసొస్తే ప్రేమ లో పడతానేమోనని సరదాగా చెప్పుకొచ్చాడు.  
 

More Related Stories