English   

v సినిమాకు భారీ డబ్బింగ్ రైట్స్.. ఫ్లాపైనా పవర్ తగ్గలే..

 Nani V
2020-09-11 09:18:41

టాలీవుడ్లో కొందరు హీరోల సినిమాలకు ఇమేజ్ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. వాళ్ళ సినిమాలో ఆడినా ఆడకపోయినా ప్రేక్షకులు మాత్రం కచ్చితంగా ఒకసారి చూడాలి అనుకుంటారు. అలాంటి హీరోల్లో నాని కూడా ఉంటాడు. ఈయనకు న్యాచురల్ స్టార్ అని ఏ ముహూర్తంలో పేరు పెట్టారో తెలియదు కానీ ఈయన సినిమాలు హిట్ అయినా ఫ్లాప్ అయినా కచ్చితంగా ఆ మాత్రం ఒకసారి చూసేద్దాం అనుకుంటారు. కనీసం నాని కోసం అయినా ఒకసారి చూసే ప్రేక్షకులు ఉన్నారు. అందుకే ఈయన సినిమాలకు శాటిలైట్ రైట్స్ తో పాటు డబ్బింగ్ రైట్స్ కూడా భారీగా అమ్ముడవుతున్నాయి. ఇప్పుడు V సినిమా విషయంలో కూడా ఇదే జరిగింది. సెప్టెంబర్ 5న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైన ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది. ఇంకా చెప్పాలంటే ఫ్లాప్ అయ్యింది.

కాకపోతే డిజిటల్ రిలీజ్ కాబట్టి.. కలెక్షన్ల లెక్క ఉండదు కాబట్టి ఈ సినిమాను సేఫ్ అని చెప్పొచ్చు. నిర్మాతకు భారీ గానే లాభాల పంట పండించింది ఈ సినిమా. ఇక ఇప్పుడు శాటిలైట్ రైట్స్, డబ్బింగ్ రైట్స్ రూపంలో దిల్ రాజుకు మరిన్ని కోట్లు వచ్చాయి. తెలుగు శాటి లైట్ రైట్స్ ఏకంగా 8 కోట్లకు అమ్ముడయినట్లు తెలుస్తోంది. ఇక హిందీ డబ్బింగ్ రైట్స్ కూడా దాదాపు ఎనిమిది కోట్లు పెట్టి కొన్నారు. సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చినా కూడా యాక్షన్ ఎంటర్టైనర్ కావడంతో భారీ రేటు పలికినట్లు ప్రచారం జరుగుతోంది. ఏదేమైనా కూడా ఒకవేళ థియేటర్లలో విడుదల అయి ఉంటే ఖచ్చితంగా వి సినిమాకు ఇన్ని లాభాలు మాత్రం వచ్చి ఉండేది కాదు అంటున్నారు విశ్లేషకులు. 

More Related Stories