English   

వకీల్ సాబ్ మరో నటికి కరోనా పాజిటివ్

Vakeel Saab
2021-04-08 12:48:17

కరోనా మహమ్మారి సినీ పరిశ్రమను వెంటాడుతోంది. రోజుకో సెలబ్రెటీ అయినా తమకు కరోనా పాజిటివ్ వచ్చిందంటూ చెబుతున్నారు. ఇప్పటికే బాలీవుడ్ నటీనటులు రన్బీర్ కపూర్, అలియా భట్ సహా పలువురు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఇక టాలీవుడ్ నుండి నిర్మాత అల్లు అరవింద్, ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ మరియు నటి నివేదిత థామస్ కరోనా బారిన పడ్డారు. కాగా తాజాగా వకీక్ సాబ్ సినిమాలో కీలక పాత్రలో నటించిన నటి అంజలి కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని అంజలి సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. 

అంతే కాకుండా ప్రతి ఒక్కరు కరోనా పట్ల జాగ్రత్తగా ఉండాలని పేర్కొంది. ఇదిలా ఉండగా ఇప్పటికే వకీల్ సాబ్ సినిమాలో నటించిన నటి నివేదితా థామస్ కూడా కరోనా బారిన పడింది. ఇటీవల తనకు కరోనా పాజిటివ్ వచ్చిన విషయాన్ని నివేదితా థామస్ వెల్లడించింది. అంతే కాకుండా కరోనా కారణంగానే నివేదిత వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు దూరంగా ఉంది. అయితే అంజలి మాత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సందడి చేసింది. ఈ ఈవెంట్ ఎప్రిల్ 5న జరిగింది. ఇక అంజలి ఈవెంట్ లో పాల్గొనటం తో వకీల్ సాబ్ టీమ్ కు టెన్షన్ మొదలైంది. అంతే కాకుండా కరోనా బారిన పడటంతో అంజలి మరియు నివేదిత థామస్ లు వకీల్ సాబ్ ప్రమోషన్స్ లో పాల్గొనే అవకాశం లేకుండా పోయింది.

More Related Stories