English   

వ‌కీల్ సాబ్ నుండి విడుద‌లైన కంటిపాప సాంగ్

Vakeel Saab
2021-03-17 17:41:50

పవర్‌స్టార్‌ ‘వకీల్‌సాబ్‌’ సినిమాతో త్వరలోనే ఫ్యాన్స్ ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే , ఈ చిత్ర యూనిట్‌ సినిమాకు సంబంధించి ఇప్పటికే రెండు పాటలను విడుదల చేసింది. మొదటిపాట ‘మగువ..మగువ’.. రెండోది ‘సత్యమేవ జయతే’. అయితే తొలిపాటను 2020 మహిళా దినోత్సవం సందర్భంగా విడుదలకాగా,  రెండో పాటను సరిగ్గా ఏడాది  తర్వాత 2021లో విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇవి రెండు కూడా ఇప్పటికే యూట్యూబ్‌లో దూసుకుపోతున్నాయి. అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. 

అయితే, తాజాగా ‘కంటిపాప..కంటిపాప’ అనే పాటను యూట్యూబ్ లో విడుద‌ల చేసింది చిత్ర యూనిట్ . ఈ పాట‌కు రామ‌జోగ‌య్య శాస్రి ర‌చ‌యిత కాగా..పాట‌ను అమాన్ మాలిక్ పాడారు.  వ‌కీల్ సాబ్ నుండి సాంగ్ రావ‌డంతో ప‌వ‌న్ అభిమానులు సోష‌ల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. ఈ సినిమాను వేణు శ్రీరామ్‌ దర్శకత్వం వహించగా, దిల్‌రాజు దీన్ని నిర్మిస్తున్నాడు.​ వకీల్‌సాబ్‌ సినిమాకు తమన్‌ అద్భుతమైన సంగీతాన్ని అందిస్తున్నాడు. అయితే, ఈ సినిమాలో పవన్‌కు జోడీగా లీడ్‌ పాత్రలో శ్రుతిహసన్‌ నటిస్తున్నారు.

More Related Stories