English   

ఉమెన్స్ డే విషెస్ చెప్పిన వకీల్ సాబ్

Vakeel Saab
2021-03-08 11:18:25

ఈ రోజు మహిళా దినోత్సవం సంధర్బంగా వకీల్ సాబ్ టీమ్ మహిళలందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఒక పోస్టర్ ను విడుదల చేసింది. ఈ పోస్టర్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మధ్యలో కూర్చోగా ఆయన చుట్టూ నటీమణులు నివేదిత థామస్, అంజలి, అనన్య నాగల్లా నిలుచున్నాను. పోస్టర్ లో నటీమణులతో పాటు పవన్ కళ్యాణ్ కూడా సీరియస్ లుక్స్ తో కనిపిస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా మహిళల హక్కుల కోసం పోరాటం నేపథ్యంలో తెరకెక్కుతునట్టు తెలుస్తోంది. 

ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన "మగువా మగువా" అనే సాంగ్ శ్రోతలు ఫిదా అయ్యారు. అంతే కాకుండా ఇటీవల విడుదలైన "సత్యమేవజయతే" పాట కూడా యుట్యూబ్ లో రికార్డులు సృష్టిస్తోంది. ఈ చిత్రాన్ని బాలీవుడ్ లో సూపర్ హిట్ గా నిలిచిన పింక్ చిత్రానికి రీమేక్ గా తెరకెక్కిస్తున్నారు. సినిమాను దిల్ రాజు మరియు బాలీవుడ్ నిర్మాత బోణీ కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సినిమాకు ఎస్ఎస్ థమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. ఈ సినిమా ఎప్రిల్ 9న విడుదల కాబోతోంది.

More Related Stories