English   

పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ ట్రైలర్ రివ్యూ.. న్యాయం కోసం.. 

Vakeel SaabTrailer
2021-03-29 18:18:13

చాలా రోజులుగా పవన్ కళ్యాణ్ అభిమానులు వెయిట్ చేస్తున్న రోజు వచ్చింది. ఈయన నటిస్తున్న వకీల్ సాబ్ ట్రైలర్ విడుదలైంది. ఇది చూసిన తర్వాత సినిమా ఎలా ఉండబోతుందో అర్థమవుతుంది. ఒక వైపు పవన్ కళ్యాణ్ ఇమేజ్ బ్యాలెన్స్ చేస్తూనే మరోవైపు కథని ఎక్కడ పక్కదారి పట్టించకుండా వేణు శ్రీరామ్ చాలా అద్భుతంగా తెరకెక్కించాడని ట్రైలర్ చూస్తేనే అర్థమైపోతుంది. పింక్ సినిమాకు రీమేక్ గా ఇది వస్తుంది. ఇప్పటికే తమిళంలో అజిత్ హీరోగా నేర్కొండ పార్వై పేరుతో ఈ సినిమాను రీమేక్ చేశారు. అక్కడ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇప్పుడు తెలుగులో పవన్ కళ్యాణ్ రీమేక్ చేస్తున్నాడు. 

ట్రైలర్ చూసిన తర్వాత సినిమాపై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. మీరు వర్జినా కాదా అంటూ ప్రకాష్ రాజ్ అడిగే దగ్గర్నుంచి చివర్లో పవన్ కళ్యాణ్ అదే డైలాగ్ అడిగే వరకు చాలా ఆసక్తికరంగా ఈ ట్రైలర్ సాగింది. 2 నిమిషాల 9 సెకన్ల ట్రైలర్ లో ఎక్కువగా అంజలి, అనన్య, నివేద థామస్, ప్రకాష్ రాజ్, పవన్ కళ్యాణ్ కనిపించారు. కోర్టు సన్నివేశాలు కూడా చాలా బాగా హైలైట్ అయ్యాయి. దాంతోపాటు మెట్రో ట్రైన్ లో వచ్చే యాక్షన్ సీక్వెన్స్ కూడా ట్రైలర్ లో చూపించారు కానీ శృతి హాసన్ జాడ కనిపించలేదు. ఒరిజినల్ లో లేని చాలా సన్నివేశాలు కూడా ఈ సినిమాలో ఉండబోతున్నాయని ట్రైలర్ లోనే తెలిసిపోతుంది. ఎప్రిల్ 9న విడుదల కానుంది ఈ చిత్రం. దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 

More Related Stories