English   

వ‌క్కంతం వంశీ.. పాతికేళ్ల క‌ల‌..!

allu-arjun

ఒక‌టి రెండు కాదు.. పాతికేళ్లుగా ఆయ‌న ద‌ర్శ‌కుడు అవ్వాల‌ని క‌ల‌లు కంటున్నాడు. ఆయ‌న త‌ర్వాత వ‌చ్చిన వాళ్లు.. ఆయ‌న‌తో ప‌ని చేసిన వాళ్లు కూడా ద‌ర్శ‌కులు అయిపోతున్నారు. చివ‌రికి త‌న అసిస్టెంట్ ల‌కు కూడా క‌థ‌లు అందించాడు.. కానీ ఆయ‌న‌కు మాత్రం టైమ్ రాలేదు. త‌న టైమ్ కోసం వేచి చూస్తూనే ఉన్నాడు. ఇన్నాళ్ల‌కు అది వ‌చ్చింది. పాతికేళ్ల నిరీక్ష‌ణ త‌ర్వాత మెగాఫోన్ ప‌ట్టుకున్నాడు వ‌క్కంతం వంశీ. వ‌చ్చిన తొలి ఆఫ‌రే అల్లు అర్జున్ లాంటి స్టార్ ఇచ్చాడు. దాంతో నిశ్చింత‌గా ఉన్నాడు వంశీ. ఈయ‌న తెర‌కెక్కించిన నా పేరు సూర్య మే 4న విడుద‌ల కానుంది. నా పేరు సూర్య క‌చ్చితంగా త‌న క‌ల నెర‌వేరుస్తుంద‌ని ధీమాగా చెబుతున్నాడు వ‌క్కంతం వంశీ. ఈయ‌న రాసిన క‌థ‌ల్లో కొన్ని బ్లాక్ బ‌స్ట‌ర్లు ఉన్నాయి.. కొన్ని ఫ్లాపులు ఉన్నాయి. కానీ ఇవ‌న్నీ ఆయ‌న్ని పెద్ద‌గా క‌దిలించి ఉండ‌వు. కానీ ఇప్పుడు నా పేరు సూర్య‌కు వ‌చ్చే ప్ర‌తీ అప్రిసియేష‌న్ కానీ.. క‌మెంట్ కానీ వంశీకి కీల‌కం. ఎందుకంటే ఇది త‌న సినిమా.. త‌న పాతికేళ్ళ క‌ల..! ముందు ఎన్టీఆర్ సినిమాతోనే ద‌ర్శ‌కుడిగా మార‌తానంటూ చాలా సార్లు చెప్పాడు వంశీ. కానీ న‌మ్మిన ఎన్టీఆర్ హ్యాండిచ్చాడు. అదే టైమ్ లో అల్లు అర్జున్ ఆదుకున్నాడు. ఇన్నాళ్లూ ద‌ర్శ‌కుడిగా మారాల‌న్న క‌సి ఇప్పుడు ఆ సినిమాలో క‌నిపిస్తుంది. ఇప్ప‌టికే విడుద‌లైన ట్రైల‌ర్.. సాంగ్స్ కు రెస్పాన్స్ అదిరిపోయింది. మొత్తానికి చూడాలి.. రైట‌ర్ గా ఎన్నో సంచ‌ల‌నాలు సృష్టించిన వ‌క్కంతం వంశీ.. ఇప్పుడు ద‌ర్శ‌కుడిగా ఏం చేస్తాడో..? 

More Related Stories