English   

మ‌హేశ్-వంశీ.. కాస్త లేట్ గా..!

Vamsi Paidipally Mahesh Babu
2018-06-09 12:28:57

మ‌హేశ్ బాబు సినిమా అంటేనే అంత. ఏది టైమ్ కు స‌రిగ్గా అవ్వ‌దు. కానీ క్వాలిటీ విష‌యంలో మాత్రం అస్స‌లు కాంప్ర‌మైజ్ కాడు సూప‌ర్ స్టార్. ఇక ఇప్పుడు వంశీ పైడిప‌ల్లితో త‌న 25వ సినిమా షూటింగ్ జూన్ 10 నుంచి మొద‌లు పెడ‌తాం అని ముందే చెప్పాడు మ‌హేశ్. కానీ ఇప్పుడు ఆ డేట్ ను కాస్త మార్చేసారు. వారం రోజులు ఆల‌స్యంగా ఈ చిత్ర రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లు కానుంది. జూన్ 17 నుంచి డెహ్రాడూన్ ప‌రిసర ప్రాంతాల్లో ఈ చిత్ర షూటింగ్ జ‌ర‌గ‌నుంది. తొలి షెడ్యూల్లో మ‌హేశ్ తో పాటు అల్ల‌రి న‌రేష్ కూడా పాల్గొంటాడ‌ని తెలుస్తుంది. అశ్వినీద‌త్, దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం మ‌హేశ్ కు మాత్ర‌మే కాదు.. అల్ల‌రి న‌రేష్ కు కూడా కీల‌క‌మే. భ‌ర‌త్ అనే నేనుతో అబౌ యావ‌రేజ్ ద‌గ్గ‌రే ఆగిపోయాడు మ‌హేశ్. ఈ చిత్రం 92 కోట్ల షేర్ సాధించినా కూడా అమ్మింది మాత్రం 99 కోట్ల‌కు. అంటే 7 కోట్లు లాస్ అన్న‌మాట‌. దాంతో ఇప్పుడు వంశీ సినిమాతో అది కూడా క‌వ‌ర్ చేయాల‌ని చూస్తున్నాడు సూప‌ర్ స్టార్. డిసెంబ‌ర్ లోపు ఈ చిత్ర షూటింగ్ పూర్తి చేసి.. అదే నెల‌లో సుకుమార్ సినిమాను ప‌ట్టాలెక్కించ‌డానికి ప్ర‌య‌త్నాలైతే బాగానే చేస్తున్నాడు మ‌హేశ్. వంశీ సినిమాలో పూజాహెగ్డేతో రొమాన్స్ చేస్తున్నాడు ఈ హీరో. మొత్తానికి షూటింగే అనుకున్న స‌మ‌యానికి స్టార్ట్ కాలేదు.. షూటింగ్ అయినా అనుకున్న టైమ్ కు పూర్త‌వుతుందో లేదో..? 

More Related Stories