English   

వనిత పెళ్లి వివాదం...నటి వివాదాస్పద వ్యాఖ్యలు 

Vanitha Peter paul
2020-07-05 14:16:00

తమిళ వివాదాస్పద నటి వనితా విజయ్ కుమార్ మూడో పెళ్లి జరిగిన నాటి నుండి ఆమె ఏదో ఒక కారణంతో వార్తల్లో నిలిస్తూనే ఉంది. పీటర్ పాల్ అనే వ్యక్తితో ఆమె పెళ్లి జరిగి వారం రోజులు అవుతున్నా కూడా ఇప్పటికీ ఆ పెళ్లి చుట్టూ వివాదాలు నడుస్తూనే ఉన్నాయి. ఇప్పటికే పీటర్ మొదటి భార్య ఎలిజిబిత్ తనకు విడాకులు ఇవ్వకుండానే వనితను పెళ్లి చేసుకున్నాడని ఆయనపై పోలీసు కంప్లైంట్ ఇచ్చింది. దీనిపై వనిత కూడా చాలా సీరియస్ అయిందనుకోండి. ఇప్పుడు మరో వివాదం కూడా ఈ పెళ్లి మీద మొదలయింది. తాజాగా తమిళ సీనియర్ నటి లక్ష్మీ రామకృష్ణన్ కూడా వనిత విజయ్ కుమార్ మూడో పెళ్లిపై కొన్ని వివాదాస్పద కమెంట్స్ చేసింది. ఈ క్రమంలోనే వనిత కూడా ఈమెకు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. ఈ క్రమంలోనే ఇప్పుడు మరో నటి కుట్టి పద్మిని కూడా వనితకు కొన్ని సలహాలు ఇచ్చింది. దీంతో వనిత, కుట్టి పద్మినిల వ్యవహారం రంజుగా ఉంది. వనితా విజయ్ కుమార్ మూడో భర్త పీటర్ పాల్ గురించి కుట్టి పద్మిని సోషల్ మీడియాలో కొన్ని కామెంట్స్ చేసింది. 

పీటర్ పాల్ మద్యం అలవాట్లతో పాటు ఇతర మహిళలతో అతనికి ఉన్న అక్రమ సంబంధాలపై ఆమె కొన్ని కామెంట్స్ చేసింది. అంతే కాక ఎదిగిన నీ ఇద్దరు కూతుళ్ళను హాస్టల్‌లో చేర్పించు,  అతని వలన పిల్లలకు చాలా కష్టం అంటూ వనితకు సలహా ఇచ్చింది కుట్టి పద్మిని. దీంతో ఆ సలహా మీద వనిత మండిపడింది. అస్సలు "మీ నుంచి ఇలాంటి మాటలు ఊహించలే, చాలా హర్ట్ అయ్యా, ఏదైనా కూడా నాకు పర్సనల్‌గా చెప్పాలి కానీ సోషల్ మీడియాలో కాదు.. అయినా నా వ్యక్తిగత జీవితం గురించి నీకెందుకు" అంటూ సీరియస్ వార్నింగే ఇచ్చింది వనిత. తనకు తన పిల్లలు అంటే ప్రాణమని వాళ్లను హాస్టల్‌లో వదిలేయాలంటూ ఎలా చెప్తారని వనిత ప్రశ్నిస్తోంది.   

More Related Stories