English   

మూడో భర్తను తన్ని తరిమేసిన నటి

Vanitha Vijayakumar
2020-10-20 11:11:14

లాక్ డౌన్ వేళ నటి వనితా విజయ్ కుమార్ వ్యాపారవేత్త పీటర్ పాల్ ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఎలాంటి పర్మిషన్ తీసుకోకుండా నిబంధనలను ఉల్లంఘించి వివాహం చేసుకున్నారంటూ అప్పట్లో నెలకొంది. అంతే కాకుండా ముగ్గురు పిల్లలు ఉన్న వనిత మూడో వివాహం చేసుకోవడం కూడా దుమారం లేపింది. అయితే తన పెళ్లి పై వస్తున్న నెగిటివ్ కామెంట్లను ఆమె ఘాటుగా తిప్పికొట్టింది. తనను పీటర్ బాగా అర్థం చేసుకున్నాడని అందుకే అతడితో జీవితాన్ని పంచుకోబోతున్నానని స్పష్టం చేసింది. తన పై వస్తున్న విమర్శలపై న్యాయపరంగా స్పందిస్తానని పేర్కొంది. 

ఇదిలా ఉండగా పెళ్లి తరవాత ఇటీవల వనితా ఆమె భర్త పీటర్ పిల్లలతో కలిసి గోవా ట్రిప్ కి వెళ్లారు. అయితే అక్కడ పీటర్ పాల్ ఫుల్ గా మద్యం సేవించి వనితా విజయ్ కుమార్ తో అసభ్యంగా ప్రవర్తించారట. దాంతో వనితా పీటర్ పై చేయి చేసుకుండట. అంతే కాకుండా ఇంటికి వచ్చాక కూడా పీటర్ ఫుల్ గా మద్యం సేవించి ఇంటికి రావడంతో వనిత తన్ని తరిమేసిందట. ఇప్పుడు ఈ విషయం కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ ఘటనపై నిర్మాత రవీందర్ చంద్ర శేఖర్ స్పందిస్తూ.. ఇల్లీగల్ మ్యారేజ్ కు వ్యతిరేకంగా చాలామంది కోరుకున్న కోరిక నెరవేరింది. పీపీ ని తన్ని తరిమేశారు. అంటూ పోస్ట్ చేసారు. అయితే ఈ విషయంపై నటి వనితా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.

More Related Stories