English   

నాపై జాలి చూపించకండి..వనితా విజయ్ కుమార్

Vanitha Vijayakumar
2020-10-31 14:45:23

ముచ్చటగా మూడో పెళ్లి చేసుకున్న నటి వనితా విజయ్ కుమార్ ఈ మధ్య తరచూ వార్తల్లో నిలుస్తోంది. లాక్ డౌన్ టైం లో తమిళ పరిశ్రమకు చెందిన ఓ టెక్నీషియన్ ను పెళ్లి చేసుకుంది వనితా. అయితే అంత పెద్ద పిల్లలను పెట్టుకుని పెళ్లి చేసుకుందంటూ ఆమెపై అటు నెటిజన్లు ఇటు పరిశ్రమకు చెందిన వారు సెటైర్లు వేశారు. అంతే కాకుండా లాక్ డౌన్ టైం లో కరోనా నిబంధనలను ఉల్లంఘించి పెళ్లి వేడుకను జరుపుకుంది అంటూ ఆమె వివాహం చేసుకున్న ఫంక్షన్ హాల్ ఉన్న కాలనీ వాసులు ఏకంగా ఆమెపై కేసు పెట్టారు. దాంతో ఆమె మీ జీవితాలు మీరు చూసుకోండి పీటర్ దొరకడం నా అదృష్టం..మా మనసులు కలిసాయి అంటూ మండిపడింది. ఇక అంతా సదుకుంటుంది అనే టైం లో వనిత భర్త పీటర్ తరచూ మద్యం సేవిస్తూ ఇంటికి రావడమే మనేశాడట. 

అంతే కాకుండా అతడికి గుండె పోటు కూడా వచ్చి ఆస్పత్రిలో చేరాడు. అప్పుడు వనితా నే దగ్గరుండి చికిత్స చేయిందట. దాంతో కోలుకున్న తరవాత మల్లీ పీటర్ మద్యం సేవించడం మొదలు పెట్టాడు. ఇక విసిగిపోయిన వనితా తన్ని తరిమేసిందటూ వార్తలు వచ్చాయి. వాటిపై స్పందించిన వనితా తనకు మోసపోవడం కామన్ అయిందంటూ ఆవేదన వ్యక్తం చేసింది. పీటర్ మద్యం లేకుండా బ్రతకలేడని అతడు ఇంట్లో నుండి వెళ్లిపోయాడని చెప్పుకొచ్చింది. ఇక తాజాగా వనితా మరోసారి ఫైర్ అయింది. "మీ జీవితాలు మీరు చూసుకోండి. ఆ తరవాత నా గురించి ఆలోచించవచ్చు. నాపై జాలి చూపిస్తున్నట్టు నటించకండి. నా కుటుంబ సభ్యులతో స్నేహితులతో నేను సంతోషంగా ఉన్నాను. నాపై ప్రేమ చూపిస్తున్న వారికి కృతజ్ఞతలు. నేను ఎల్లప్పుడూ వారికి అందుబాటులో ఉంటాను" అంటూ వనితా ఆవేదన వ్యక్తం చేసింది.

More Related Stories