English   

నేను గెంటెయ్యలేదు..అతడే వెళ్ళిపోయాడు..వనితా విజయ్ కుమార్

 Vanitha Vijaykumar
2020-10-22 11:23:02

ముచ్చటగా మూడో పెళ్లి చేసుకున్న నటి వనితా విజయ్ కుమార్ మూడో పెళ్లి కూడా మున్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయినట్టు కనిపిస్తోంది. వనిత తన మూడో భర్త పీటర్ ను తన్ని తరిమేసిందంటూ ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ వార్తలపై వనిత స్పందించించి. ఈ విషయంపై వనిత మాట్లాడుతూ ఓ వీడియో విడుదల చేసింది. వీడియోలో వనిత మాట్లాడుతూ....పీటర్ ను తాను తన్ని తరిమేయలేదని అతడే వెళ్లిపోయాడని చెప్పుకొచ్చింది. పీటర్ తరచూ మద్యం తగుతాడాని తెలిపింది. ప్రేమలో మోసపోవడం అలవాటైపోయిందని కానీ ధైర్యంగా ఉన్నానని పేర్కొంది. జీవితం ఒక పాఠమని తను నేర్చుకునే దశలో ఉన్నానంటూ వెల్లడించింది. 

పీటర్ పై నేను చాలా కేర్ తీసుకున్నా. కానీ అతడు మద్యానికి బానిసయ్యాడు. వారం పాటు అన్నం తినకుండా మద్యం సేవిస్తూనే ఉంటాడు. అలా ఆల్కహాల్ ఎక్కువగా తీసుకునే పీటర్ కు హార్ట్ ఎటాక్ వచ్చింది. అప్పుడు నేనే హాస్పిటల్ లో అడ్మిట్ చెసి బిల్ మొత్తం కట్టాను. హాస్పిటల్ నుండి వచ్చాక కూడా మద్యం మనేయ్యలేదు. దాంతో ఒకసారి రక్తం వాంతులు చేసుకున్నాడు. అప్పుడు హాస్పిటల్ తీసుకువెళ్లి చికిత్స చేయించాను. మళ్ళీ హాస్పిటల్ నుండి వచ్చాక కూడా అదే పనిగా తాగేవాడు. ఓ రోజు భయటకు వెళ్లి తిరిగిరాలేదు. పీటర్ అసిస్టెంట్ అతడిని ఇంటికి తీసుకువచ్చాడు. 

న్యూస్ లో వస్తున్న కథనాల వల్లే పీటర్ ఇలా తగుతున్నాడని చెప్పాడు. దాంతో ఇద్దరం కలిసి గోవా ట్రిప్ కి వెళ్ళాం అక్కడ హ్యాపీగా ఉన్నాం. వచ్చాక పీటర్ తమ్ముడు మరణించాడని వార్త వచ్చింది. అప్పుడు అతడికి నేనే డబ్బులు ఇచ్చి పంపించా. మళ్ళీ తిరిగి రాలేదు. ఫోన్ చేసినా లేపడం లేదు. నాకు తిరిగి ఫోన్ కూడా చేయలేదు. అతడు తన మొదటి భార్యతో ఉన్నా పర్వాలేదు. నాకెలాంటి ఇబ్బంది లేదు. పీటర్ తన స్నేహితులను, సినిమా వాళ్ళను డబ్బులు అడిగి తాగేవాడు. వారు నాకు ఫోన్ చేసి అసలు నీ జీవితంలో ఏం జరుగుతుందో అర్థం అవుతుందా అని నన్ను అనేవారు" అంటూ వనితా వీడియోలో కన్నీళ్లు పెట్టుకుంది.

More Related Stories