English   

అంద‌ర్నీ ఆపాడు.. ప్రియురాలిని త‌ప్ప‌..!

Varalakshmi-Sarathkumar

ఎవ‌రు ఎవ‌ర్ని ఆపారు..? ఇక్క‌డ ప్రియురాలు ఎవ‌రు అనుకుంటున్నారా..? ఈ క‌థ‌లో ప్రియుడు విశాల్.. ప్రియురాలు వ‌ర‌ల‌క్ష్మి శ‌రత్ కుమార్. అస‌లు విష‌యం ఏంటంటే.. ఇండ‌స్ట్రీలందు త‌మిళ ఇండ‌స్ట్రీ వేర‌యా అని ఊరికే అన‌లేదు. వాళ్లేం చేసినా అలా ఉంటుంది మ‌రి. ఇప్పుడు కూ-డా విశాల్ ఇదే చేసాడు. ఏకంగా ఫిల్మ్ ఫేర్ అవార్డుల‌నే బాయ్ కాట్ చేయించాడు. ఈయ‌న నిర్మాత‌ల మండ‌లి అధ్య‌క్షుడు క‌దా.. అందుకే త‌మిళ‌నాట ఎక్క‌డ ఏ వేడుక జ‌రిగినా అందులో క‌చ్చితంగా కొంత డ‌బ్బులు న‌డిగ‌ర్ సంఘానికి ఇవ్వాల‌నేది విశాల్ పెట్టిన ప్లాన్. దానికి ఎవ‌రూ స‌హ‌క‌రించ‌క‌పోయినా త‌మిళ ఇండ‌స్ట్రీ నుంచి ఎవ‌రూ ఆ వేడుక‌కు రాకూడ‌ద‌నేది రూల్. ఇప్పుడు ఫిల్మ్ ఫేర్ అవార్డుల విష‌యంలోనూ ఇదే జ‌రిగింది. ఈ వేడుక‌కు చెన్నై నుంచి ఎవ‌రూ రాలేదు. ఉత్త‌మ న‌టుడి అవార్డ్ అందుకున్న విజ‌య్ సేతుప‌తి.. న‌టి అవార్డ్ గెలుచుకున్న న‌య‌న‌తార కూడా ఫిల్మ్ ఫేర్ కు రాలేదు. దానికి కార‌ణం విశాల్. ఫిల్మ్ ఫేర్ నుంచి ఎలాంటి ఫండ్స్ రాక‌పోవ‌డంతో మ‌రో ఆలోచ‌న లేకుండా బాయ్ కాట్ చేసాడు విశాల్. అంద‌రూ ఆగినా విశాల్ ప్రియురాలు వ‌ర‌ల‌క్ష్మి మాత్రం ఈ వేడుక‌లో క‌నిపించింది. నిండుగా చీర క‌ట్టుకుని ఫిల్మ్ ఫేర్ లో క‌నిపించింది వ‌ర‌ల‌క్ష్మి. దీనికి కార‌ణం ఆమె తండ్రి శ‌ర‌త్ కుమార్ అని తెలుస్తుంది. విశాల్ కు ఎలాగూ ఆయ‌న వ్య‌తిరేకంగా ఉంటాడు కాబ‌ట్టి కావాల‌నే కూతుర్ని ఫిల్మ్ ఫేర్ కు తీసుకొచ్చాడ‌నే వార్త‌లు త‌మిళ‌నాట బ‌లంగానే వినిపిస్తున్నాయి. మొత్తానికి విశాల్ కూడా అంద‌ర్నీ ఆప‌గ‌లిగినా.. ప్రియురాల్ని మాత్రం ఆప‌లేక‌పోయాడు. 

More Related Stories