English   

 విశాల్ లవర్  అంధురాలైంది

Varalakshmi-Sarathkumar

విశాల్ లవర్ అనగానే అందరికీ వరలక్ష్మి గుర్తొస్తుంది. ఈ ఇద్దరూ కలిసి ఏకంగా సినిమాటిక్ లవ్ స్టోరీనే నడిపారు. అటు వరలక్ష్మి తండ్రి విశాల్ పాలిట విలన్ గా మారితే..ఆయన కూతురేమో విశాల్ ను విపరీతంగా ప్రేమించింది. కోలీవుడ్ లోనే కాదు.. ఎంటైర్ సౌత్ లోనే ఈ లవ్ స్టోరీకి చాలామంది ఫిదా అయ్యారు. బట్ సడెన్ గా వరలక్ష్మితో విడిపోతున్నట్టు విశాల్ ప్రకటించాడు. ఏమైందా అని అప్పటి నుంచి మొదలైన ఆరాలు నేటికీ సాగుతూనే ఉన్నాయి. బట్ లవ్ బ్రేకప్ అయినా ఈ ఇద్దరూ సినిమాలతో మాత్రం గాఢంగా లవ్ లో పడిపోయారు. మెయిన్ హీరోయిన్ గా వరలక్ష్మిని ఎవరూ ఎంటర్టైన్ చేయడం లేదు కానీ ఏదో ఒక కీలక పాత్రలో తనను బాగా తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వరలక్ష్మి చేతిలో ఇప్పుడు అరడజనుకు పైగా సినిమాలున్నాయంటే ఆశ్చర్యం కలగకమానదు. వీటిలో చాలా గ్యాప్ తర్వాత మళ్లీ విశాల్ తోనూ సండాకోళై(పందెంకోడి)-2 కూడా ఉండటం విశేషం.  ఇక కొన్ని సినిమాల్లో తనే హీరోయిన్ కూడా. అలాగే మరికొన్న సినిమాల్లో విలన్ గానూ చేస్తోంది. మొత్తంగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానూ రాణిస్తోన్న వరలక్ష్మి స్పీడ్ కు కోలీవుడ్ షాక్ అయిపోతోంది. అటు మళయాలంలో కూడా ఈ మధ్యే  ఎంట్రీ ఇచ్చిందీ బ్యూటీ. అయితే వరలక్ష్మి ఓ సినిమాలో అంధురాలిగా నటించబోతోంది. యస్.. ఇలాంటి పాత్రలు మామూలుగా మనకు హీరోలు ఎక్కువగా చేస్తుంటారు. లేడీ ఆర్టిస్టులు చేసినా పరిమిత పాత్రలుంటాయి. కానీ ఓ ప్రధాన పాత్రగా తను పూర్తిస్థాయి అంధరాలిగా నటించబోతోంది వరలక్ష్మి ఏదేమైనా బ్రేకప్ అయింది ఏడుస్తూ కూర్చోకుండా నచ్చిపని చేసుకుంటూ దూసుకువెళుతోన్న వరలక్ష్మిని చాలామంది ఆదర్శంగా తీసుకోవాలేమో.. 

More Related Stories