English   

ఎన్టీఆర్ సినిమాలో పవర్ ఫుల్ పొలిటీషియన్ గా వరలక్ష్మి

Varalaxmi Sarathakumar
2021-03-06 16:57:12

ప్రస్తుతం ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ తరవాత సినిమా షూటింగ్ కోసం రెడీ అవుతున్నారు. తదుపరి చిత్రాన్ని త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయబోతునట్టు గతంలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే. అంతే కాకుండా ఈ సినిమాకు అయిన పోయి రావలె హస్తినకు అనే టైటిల్ ను రిజిస్టర్ చేయించారు. ఇక ఈ చిత్రాన్ని పవర్ ఫుల్ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించబోతున్నట్టు ఫిల్మ్ నగర్ లో టాక్ వినిపిస్తోంది. 

కాగా తాజాగా ఈ సినిమాపై మరో వార్త చక్కర్లు కొడుతోంది. సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తోంది. పవర్ ఫుల్ లేడీ పొలిటీషియన్ పాత్రలో వరలక్ష్మి నటించబోతునట్టు తెలుస్తోంది. ఇక ఇప్పటికే వరలక్ష్మి తెలుగులో క్రాక్ సినిమాలో నటించి అలరించింది. ఈ సినిమాలో జయమ్మ పాత్రలో వరలక్ష్మి అదరగొట్టింది. అంతే కాకుండా ఇటీవల విడుదలైన నాంది సినిమాలోనూ వరలక్ష్మి పాత్రకు మంచి మార్కులు పడ్డాయి. కాగా ఈ సినిమాలను చూసిన తరువాతే త్రివిక్రమ్ ఎన్టీఆర్ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ కు పవర్ ఫుల్ లేడి పొలిటీషియన్ పాత్రను ఇవ్వాలనుకున్నారట. ఇక ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేవరకు వేచి చూడాల్సిందే.

More Related Stories