English   

హ‌ర్ర‌ర్ ఎంట‌ర్‌టైన‌ర్ లో వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్

Varalaxmi Sarathkumar
2021-03-05 18:17:41

త‌మిళ న‌టుడు శ‌ర‌త్ కుమార్ కూతురు వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ ఇప్పుడు టాలీవుడ్ ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌ర‌వుతోంది. క్రాక్ సినిమాలో జ‌య‌మ్మ పాత్ర‌లో న‌టించిన వ‌ర‌ల‌క్ష్మి న‌ట‌నకు ప్రేక్ష‌కులు ఫిదా కాగా...నాంది సినిమాలోనూ ఆమె న‌ట‌న‌కు మంచి మార్కులు ప‌డ్డాయి. ఈ రెండు సినిమాల‌తో వ‌చ్చిన క్రేజ్ తో వ‌ర‌ల‌క్ష్మికి తెలుగులో సైతం ఫ్యాన్స్ అయ్యారు. ఇక‌ ఇప్పుడు హర్ర‌ర్ ఎంట‌ర్టైన‌ర్ తో ఆక‌ట్టుకునేందుకు సిద్ద‌మౌతోంది. డార్లింగ్ స్వామి డైరెక్ష‌న్‌లో హ‌వీష్ ప్రొడ‌క్ష‌న్‌లో తెర‌కెక్కుతున్న సినిమాలో వ‌ర‌ల‌క్ష్మి ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తోంది. ఈ సినిమాను హ‌వీష్ ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్‌పై కాంచ‌న కోనేరు నిర్మిస్తున్నారు. వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్‌కుమార్ బ‌ర్త్‌డేని పుర‌స్క‌రించుకొని ఈ చిత్రాన్ని ప్ర‌క‌టించారు. ఈ సంద‌ర్భంగా ఆమెకు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తూ చిత్ర యూన‌ట్ ఒక పోస్ట్‌ర్‌ను కూడా రిలీజ్ చేసింది. ఇక ముర‌ళీకృష్ణ కొడాలి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌గా వ్య‌వ‌హ‌రించే ఈ చిత్రానికి గాంధీ న‌డికుడిక‌ర్ ఆర్ట్ డైరెక్ట‌ర్‌గా, అమ‌ర్ రెడ్డి ఎడిట‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు.

More Related Stories