English   

చిరంజీవి అల్లుడి కొత్త టైటిల్ తెలుసా..?

Varaprasad-Gari-Alludu
2018-06-21 18:27:50

మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు స్పీడ్ పెంచుతున్నాడు. ఇప్పటికే విజేత అనే సినిమాతో హీరోగా పరిచయం కాబోతోన్న కళ్యాణ్ దేవ్.. అది రిలీజ్ కాకుండానే మరో సినిమాకు సైన్ చేసినట్టు టాక్. అయితే ఫస్ట్ మూవీకి మామయ్య సినిమా టైటిల్ పెట్టుకున్న ఈ కుర్రాడు.. ఈ సారి ఏకంగా మావయ్య పేరునే టైటిల్ గా పెట్టుకోబోతున్నట్టు ఫిలిమ్ నగర్ లో గుసగుసలు పోతున్నారు. అవును చిరంజీవి అసలు పేరును టైటిల్ గా కళ్యాణ్ దేవ్ కొత్త సినిమా రాబోతోందనే వార్త హల్చల్ చేస్తోంది. మరి అదేంటో తెలుసా..?

ప్రస్తుతం విజేత సినిమా పూర్తి కావొచ్చింది. రీసెంట్ గా రిలీజ్ చేసిన టీజర్ కూ మంచి స్పందన వచ్చింది. ఆ టీజర్ ను బట్టి ఇది ఫ్యామిలీ అండ్ లవ్ ఎంటర్టైనర్ గా చెప్పుకోవచ్చు. ఎవడే సుబ్రహ్మణ్యం, కళ్యాణ వైభోగమే ఫేమ్ మాళవిక నాయర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక జూలై విడుదల అనే టాక్ వినిపిస్తోంది. అయితే ఈ మూవీకి విడుదల కాకుండానే కళ్యాణ్ దేవ్ మరో సినిమా టైటిల్ తో సహా చెప్పేస్తున్నారు కొందరు. ఆ టైటిల్ ఏకంగా చిరంజీవి అసలు పేరుతో ఉండటంతో నిజమైనా కాకపోయినా బాగా ఆకట్టుకుంటోంది. మెగాస్టార్ చిరంజీవి అసలే పేరు కొణిదెల శివశంకర వరప్రసాద్ అని అందరికీ తెలుసు. ఆ పేరు లోనుంచే ఇప్పుడు ‘వరప్రసాద్ గారి అల్లుడు’అనే టైటిల్ పెట్టినట్టు టాక్. ప్రస్తుతం స్క్రిప్ట్ దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన వివరాలు కూడా అతి త్వరలోనే తెలియజేస్తారని టాక్. ఏదేమైనా మెగా వారి చిన్నల్లుడు స్పీడ్ గా ఉన్నాడు.. 

More Related Stories