English   

వ‌ర్మ ఇంకా మారలేదా ?

varma not change

చావు బ‌తుకుల మ‌ధ్య ఉన్న‌వాడికి ఆక్సీజ‌న్ అందించిన‌ట్లు.. వ‌ర‌స ఫ్లాపుల్లో ఉన్న వ‌ర్మ‌కు ఆఫీస‌ర్ తో ఛాన్స్ ఇచ్చాడు నాగార్జున‌. కానీ అలాంటి అవ‌కాశం కూడా వ‌దిలేసుకున్నాడు వ‌ర్మ‌. నా స‌త్తా చూపిస్తా.. వ‌ర్మ నిద్ర లేసాడు.. చెప్పింది చెప్పిన‌ట్లు తీయ‌క‌పోతే ఎక్క‌డ ప‌డితే అక్క‌డ త‌న్నిం చుకుంటానంటూ చాలా శ‌ప‌థాలు చేసాడు వ‌ర్మ‌. కానీ ఇప్పుడు ఆఫీస‌ర్ విడుద‌లైంది. మ‌ళ్లీ అదే టాక్ వ‌చ్చింది. వ‌ర్మ‌లో ఇంత కూడా మార్పేమీ రాలేదు. మ‌రోసారి రొటీన్ సినిమా తీసాడు. తాను మార‌డు.. ప్రేక్ష‌కుల్ని కూడా విసిగించ‌కుండా ఉండ‌లేడ‌ని అర్థ‌మైపోయింది. నాగార్జున అవ‌కాశం ఇచ్చినా కూడా ఏ మాత్రం సీరియ‌స్ గా తీసుకోకుండా తీసిపారేసే సినిమా ఒక‌టి చేసాడు వ‌ర్మ‌. దాంతో ఈ సారి అత‌డిని న‌మ్మినందుకు నాగార్జున‌కు కూడా విమ‌ర్శ‌లు త‌ప్ప‌డం లేదు. ఇది చూసిన త‌ర్వాత వ‌ర్మ‌కు ఇంకే స్టార్ హీరో అవ‌కాశం ఇవ్వ‌డు. బాలీవుడ్ లో ఆ మ‌ధ్య అమితాబ్ ను స‌ర్కార్ 3 అంటూ ముంచేసాడు.. ఇప్పుడు నాగార్జున‌ను ఆఫీస‌ర్ అంటూ ముంచేసాడు. మ‌రి ఈయ‌న నుంచి న‌మ్మ‌ద‌గ్గ సినిమా ఎప్పుడు వ‌స్తుందో.. అస‌లు వ‌స్తుందో రాదో..? 

More Related Stories