English   

ఈ డ్రామాలేంది వర్మా..?

Varma officer drama
2018-05-29 14:59:39

కొందరు రౌడీలు(అలాగే కనిపిస్తున్నారు) ఇరుకైన వీధుల వెంట గన్స్ పట్టుకుని ఎవర్నో వెదుకుతూ వస్తుంటారు. ఆ పక్కనే ప్లాస్టిక్ వాటర్ డ్రమ్స్ వెనక ఓ యువకుడు స్టైలిష్ గా నక్కుతాడు. కళ్లజోడుతో చూడగానే పెద్ద ఆఫీసర్ లా ఉంటాడు. వీళ్లు అతన్ని చూడకుండానే ముందుకు వెళతారు. అతను వీరి వెనక తుపాకీతో వస్తుంటాడు. ఎవరూ అతన్ని చూడరు. అలా వెళ్లినవాళ్లు ఆ వీధి దాటి బయటకు రాగానే బీచ్ లో తేలతారు. అక్కడ ఎవర్నో వెదుకుతుంటారు. ఆ ఆఫీసర్ లాంటి యువకుడు కూడా వీరి వెనకే వస్తాడు. కట్ చేస్తే ఓ బనీయన్ వేసుకున్న వ్యక్తి బెలూన్స్ అమ్ముతూవెళుతుంటాడు.. రౌడీలు వెదుకుతుంటారు.. ఆఫీసర్ వెదుకుతూ.. ఆగిపోతాడు.. 

ఇదంతా ఏంటీ అనుకుంటున్నారా..? రామ్ గోపాల్ వర్మ, నాగార్జునల ఆఫీసర్ ట్రైలర్.. అవును.. అస్సలే మాత్రం ఆకట్టుకునేలా లేని ఈ ట్రైలర్ కు అతను బీచ్ డ్రామా అనే వెరైటీ పేరు కూడా పెట్టాడు. ఇక ఇది చూసిన తర్వాత కూడా ఎవరైనా ఆఫీసర్ ను చూసే దమ్ముంటే రండి అని రామ్ గోపాల్ వర్మే ఛాలెంజ్ విసిరినట్టుగా ఉన్న ఈ డ్రామా నిజంగానే అతని మైండ్ సెట్ ను తెలియజేస్తోంది. పాపం నాగార్జున.. చాలా నమ్మకాలు పెట్టుకుని ఆఫీసర్ అయ్యాడు. బట్ వర్మ.. అతన్నేం చేస్తాడో మరి. 

More Related Stories