English   

వర్మ నుంచి వైరస్ వస్తోంది..

Varma virus
2018-06-11 11:12:44

మొన్న ఆఫీసర్ ను వదిలి అందరి చేతా తిట్లు తిన్న రామ్ గోపాల్ వర్మ ఈ సారి మరో  స్ట్రాంగ్ రివెంజ్ తో వస్తున్నాడు. అందుకే ఆడియన్స్ పైకి వైరస్ ను వదలబోతున్నాడు. ఈ వైరస్ ఎక్కడో ఆఫ్రికా దేశంలో తయారైందట. ఆ వైరస్ నే ఇండియాకు తీసుకురాబోతున్నాడు వర్మ. అయితే ఇది నిజమైన వైరస్ కాదు లెండి.. ఆఫీసర్ అట్టర్ ఫ్లాప్ అయినా.. వర్మ వెంటనే మరో సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా పేరే వైరస్. అయితే ఈ సినిమాను గతంలో అతనితో సర్కార్, ఎటాక్స్ ఆఫ్ 26/11 వంటి సినిమాలు నిర్మించిన పరాగ్ సింఘ్వి ఈ చిత్రాన్ని నిర్మించబోతుండటం విశేషం. ఈ మేరకు దర్శక నిర్మాతలిద్దరూ కలిసి సినిమా కంటెంట్ తో సహా ఓ ప్రెస్ నోట్ ను రిలీజ్ చేయడం ఆశ్చర్యంగా ఉంది. 

‘చదువు కోసం ఓ విద్యార్థి సెంట్రల్ ఆఫ్రికా వెళతాడు. అక్కడ అతనికి ఎబోలా కంటే భయంకరమైన వైరస్ సోకుతుంది. అది తెలియక అతను ముంబై వస్తాడు. తర్వాత ఇక్కడ ఆ వ్యాధి అందరికీ వ్యాపిస్తుంది. దీంతో లక్షల సంఖ్యలో ప్రజలు మరణిస్తుంటారు. దీనిని అరికట్టేందుకు ప్రభుత్వం, అధికార్లు ఎంత ప్రయత్నించినా ఆ వ్యాధి ఎవరిలో ఉందనేది కనిపెట్టడం సాధ్యం కాదు. ఈ నేపథ్యంలో ఎవరినీ ముంబై వదిలి వెళ్లొద్దని ఆదేశాలు జారీ చేస్తారు. కానీ అందులో వ్యాధి లేనివారు కూడా ఉంటారు కదా. వాళ్లంతా పారిపోవాలని ప్రయత్నిస్తే వారిని కాల్చివేయాలని ఉత్తర్వులు ఇస్తారు. సో.. ఆ వైరస్ కు ప్రభుత్వ యంత్రాంగానికి మధ్య జరిగే కథే ఈ వైరస్’.. కథ.. మొత్తంగా వర్మ ఇంట్రెస్టింగ్ ప్లాట్ అయితే చెప్పాడు కానీ.. దాన్ని అంతే ఇంట్రెస్టింగ్ గా తెరకెక్కిస్తాడని మాత్రం అస్సలు నమ్మలేం. 

More Related Stories