English   

వ‌రుణ్ చివ‌రికి అలా సెట్ట‌య్యాడ‌న్న‌మాట‌..

Varun Sandesh Hey Krishna webseries
2018-02-19 15:37:08

వ‌రుణ్ అంటే ఇక్క‌డ వ‌రుణ్ తేజ్ కాదండోయ్..! వ‌రుణ్ సందేశ్.. అప్ప‌ట్లో హ్యాపీడేస్, కొత్త‌బంగారులోకం లాంటి వ‌ర‌స విజ‌యాల‌తో ఇండ‌స్ట్రీని షేక్ చేసాడు ఈ కుర్రాడు. కానీ త‌ర్వాత విజ‌యాల్లేక త‌నే షేక్ అయిపోయాడు. ఒక‌ప్పుడు సినిమాలు ఫ్లాప్ అయితే అయ్యో ఏం చేయాల్రా దేవుడా అని కుర్ర హీరోలు త‌ల‌లు ప‌ట్టుకునే వాళ్లు. పాపం కొంద‌రైతే కెరీర్ ఇచ్చిన షాక్ నుంచి కోలుకోలేక లోకాన్ని వ‌దిలేసారు. కానీ ఇప్పుడు ప‌రిస్థితులు మారిపోయాయి. ఇండ‌స్ట్రీ ఇప్పుడు ఎన్నో అవ‌కాశాల‌కు ఓపెన్ గేట్ గా మారిపోయింది. సినిమాలు.. అవి కాక‌పోతే సీరియ‌ల్స్.. అవి కాక‌పోతే షార్ట్ ఫిల్మ్స్.. అవి కూడా కాక‌పోతే వెబ్ సిరీస్. ఇప్పుడు మ‌న కుర్ర హీరోలు కూడా ఇదే చేస్తున్నారు.

వ‌రుణ్ సందేశ్ నే తీసుకోండి. కొత్త బంగారు లోకం త‌ర్వాత‌ వ‌ర‌స‌గా 15 ఫ్లాపులు ఇచ్చాడు. ఒక్క‌టంటే ఒక్క హిట్ అందుకోలేక చ‌తికిల‌ప‌డ్డాడు. పైగా రెండేళ్లుగా సినిమా అవ‌కాశాల్లేక ఖాళీగా ఉన్నాడు ఈ కుర్ర హీరో. దాంతో మ‌నోన్ని ఆల్ మోస్ట్ అంతా మ‌రిచిపోయారు. ఇలాంటి స‌మ‌యంలో నేను ఉన్నానంటూ గుర్తు చేయ‌డానికి హే కృష్ణ అనే వెబ్ సిరీస్ లో హీరోగా న‌టిస్తున్నాడు వ‌రుణ్ సందేశ్. ఇది ఇప్ప‌టికే యూ ట్యూబ్ లో విడుద‌లైంది. ఇప్పుడు వెబ్ సిరీస్ ల‌కు ఉన్న డిమాండ్ తెలుసుకుని అక్క‌డ సెటిల్ అవ్వాల‌ని చూస్తున్నాడు వ‌రుణ్ సందేశ్.

ఇక వ‌రుణ్ కంటే ముందే సుమంత్ అశ్విన్ కూడా ఇదే బాట‌లో న‌డిచాడు. స్మార్ట్ లుకింగ్ తో ప‌డేసే ఈ కుర్రాడు కెరీర్ ను మ‌లుపుతిప్పే స‌రైన స‌క్సెస్ కోసం వేచి చూస్తున్నాడు. అంత‌కుముందు ఆ త‌ర్వాత‌, ల‌వ‌ర్స్, కేరింత లాంటి సినిమాల‌తో సుమంత్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే స్టార్ గా మాత్రం మార‌లేదు. దాంతో కెరీర్ యు ట్యూబ్ వైపు ట‌ర్న్ తీసుకున్నాడు ఈ కుర్ర హీరో. రెండేళ్లుగా ఈ హీరో కెరీర్ మ‌రీ దారుణంగా త‌యారైంది. క‌నీసం సుమంత్ సినిమా వ‌చ్చిన‌ట్లు కూడా ప్రేక్ష‌కుల‌కు తెలియ‌ట్లేదు. ఇలా వ‌చ్చి అలా వెళ్లిపోతున్నాయి అత‌డి సినిమాలు. ఫ్యాష‌న్ డిజైన‌ర్ తో స‌హా. దాంతో మ‌నోడు ఎంచ‌క్కా సినిమాలు వ‌దిలేసి వెబ్ సిరీస్ పై ప‌డ్డాడు. ఎందుకిలా అంటూ ఆ మ‌ధ్య ఓ వెబ్ సిరీస్ చేసాడు. దేవాక‌ట్ట దీనికి ద‌ర్శ‌కుడు. మొత్తానికి వెబ్ సిరీస్ లు వ‌చ్చిన త‌ర్వాత సినిమాలు లేక‌పోయినా ప్రేక్ష‌కుల‌కు మాత్రం దూరం కావ‌ట్లేదు ఈ కుర్ర హీరోలు.

More Related Stories