English   

వరుణ్ తేజ్, అదితి ఫిదా చేశారు

Aditi Rao Hydari Varun Tej
2018-07-27 22:01:31

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ స్పీడ్ పెంచాడు. వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ఘాజీ ఫేమ్ సంకల్ప్ రెడ్డి డైరెక్షన్ లో స్పేస్ బ్యాక్ డ్రాప్ లో సినిమా చేస్తున్నాడు. దీంతో పాటు అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వెంకటేష్ తో ఎఫ్-2 అనే సినిమా చేస్తున్నాడు. మరోవైపు ఓ రెండు ప్రాజెక్ట్స్ రెడీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో సంకల్ప్ రెడ్డి సినిమా షూటింగ్ కు సంబంధించిన ఓ ఫోటోను ఆ మూవీ హీరోయిన్ అదితిరావు హైదరి ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. ఈ జంట చూడ్డానికి చాలా బాగుందనే విషయం ఈ స్టిల్ చూస్తేనే తెలుస్తోంది.

ఇంతకీ ఈ స్టిల్ ఎక్కడిదో తెలుసా.. ఈ సినిమా షూటింగ్ కోసం ప్రస్తుతం వీళ్లు రామేశ్వరం లో ఉన్నారు. అక్కడ మాజీ రాష్ట్రపతి, శాస్త్రవేత్త అబ్దుల్ కలామ్ చదువుకున్న పాఠశాల ఉంది. ఈ స్టిల్ ఆ స్కూల్ లోనిదే. ఈ విషయాన్నే తెలియజేస్తూ అదితిరావు హైదరి ట్వీట్ చేసింది. దీంతో ఈ జంట లుక్ కూడా బయటకు వచ్చింది. ఇప్పటి వరకూ ఈ సినిమా షూటింగ్ కు సంబంధించి వచ్చిన అప్డేట్స్ లో ఇదే ఫస్ట్ స్టిల్ అనుకోవచ్చు. ఇక ఫోటోతో పాటు ఇక్కడ కూర్చుంటే కలామ్ గారి విజ్ఞానం మాకూ కొంత అంటుకుంటే బావున్ను అన్నట్టుగా క్యాప్షన్ పెట్టింది. ప్రస్తుతం చాలా వేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ ఫస్ట్ స్పేస్ బ్యాక్ డ్రాప్ మూవీ ఈ యేడాది డిసెంబర్ లో విడుదల కానుంది.

More Related Stories