English   

వ్యామోగామీ.. విజయవిహారం చేయాలి

Varun tej-Sankalp Reddy

కొందరు దర్శకులు రొటీన్ రూట్ లో వెళ్లరు. తమకంటూ ఓ కొత్త పాథ్ క్రియేట్ చేసుకుంటారు. అలాంటి వారిలో సంకల్ప్ రెడ్డి ఒకడు. ఫస్ట్ మూవీతోనే ఇండియాస్ బెస్ట్ మూవీగా రికార్డ్ సాధించాడు. ఏకంగా నేషనల్ అవార్డ్ కూడా కొట్టేశాడు. అతను తెరకెక్కించిన ఘాజీ ఫస్ట్ ఇండియన్ సబ్ మెరైన్ మూవీ కావడం విశేషం. అసలు ఇలాంటి థాట్ ఇంతకు ముందు ఎవరికైనా వచ్చిందా అనేది డౌటే. అప్పుడు నీళ్లలో సినిమా తీసి హిట్ కొట్టిన సంకల్ప్ ఇప్పడు నింగికి వెళుతున్నాడు. యస్ సంకల్ప్ ఇప్పుడు స్పేస్ బ్యాక్ డ్రాప్ లో సినిమా చేస్తున్నాడు. నిన్న అఫీషియల్ గా ప్రారంభం అయిందీ మూవీ. వరుస విజయాలతో దూసుకుపోతోన్న వరుణ్ తేజ్ ఈ మూవీలో హీరో.

స్టోరీ సెలెక్షన్లో మెగా హీరోలకు భిన్నంగా వెళుతోన్న వరుణ్ తేజ్ రీసెంట్ గా రెండు పెద్ద విజయాలు అందుకున్నాడు. అంతే కాదు.. ఓవర్శీస్ లో కూడా మంచి మార్కెట్ క్రియేట్ చేసుకున్నాడు. అదే సంకల్ప్ ను స్పేస్ బ్యాక్ డ్రాప్ మూవీకి వరుణ్ ను హీరోగా తీసుకోవాలనుకోవడానికి కారణమైంది. అయితే మన దర్శకుల్లో చాలామందికి ద్వితీయ విఘ్నం ఉంది. ఫస్ట్ మూవీతో బెస్ట్ ఇంప్రెషన్ వేసిన చాలామంది సెకండ్ మూవీతో మెప్పించలేకపోయారు. ఒకవేళ ఈ విఘ్నాన్ని సంకల్ప్ అధిగమిస్తే.. ఇలాంటి సబ్జెక్ట్ పిక్ చేసుకున్నందుకు వరుణ్ కు ప్రశంసలు వస్తాయి. అంటే దర్శకుడు సెకండ్ టెస్ట్ పాసైతే, వరుణ్ తేజ్ కు హ్యాట్రిక్ అవుతుంది. వరుణ్ తేజ్ సరసన అదితిరావు హైదరి, లావణ్య త్రిపాఠీ హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ మూవీలో వరుణ్ ఆస్ట్రోనాట్(వ్యామోగామి) గా కనిసిస్తాడు. మొదట్లో జార్జియాలో చిత్రీకరించాలనుకున్నారు. కానీ ఫైనల్ గా మళ్లీ హైదరాబాద్ లోనే సెట్ వేశారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లబోతోన్న ఈ మూవీని ఈ యేడాదే విడుల చేయాలనుకుంటున్నారు. కానీ ఇలాంటి సినిమాలకు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఎక్కువగా ఉంటుంది. మరి అది సాధ్యమవుతుందా లేదా అనేది చూడాలి. బట్ రొటీన్ భిన్నంగా ఓ మంచి ప్రయత్నం చేస్తోన్న సంకల్ప్ అండ్ టీమ్ ఆల్ ది బెస్ట్ చెప్పేద్దాం.  

More Related Stories