English   

అంత‌రిక్షం విడుద‌ల‌.. అన్నీ అనుమానాలే.. 

Varun_tej
2018-12-05 08:58:46

డిసెంబ‌ర్ 21న అంత‌రిక్షం విడుద‌ల అవుతుందా లేదా..? అదేంటి.. వ‌స్తుంద‌ని ద‌ర్శ‌క నిర్మాత‌లే ఒక‌టికి రెండుసార్లు చెబుతున్నారు కదా మ‌ళ్లీ ఇప్పుడు అనుమానాలు ఎందుకు వ‌స్తున్నాయి అనుకుంటున్నారా..? అవును నిజ‌మే కానీ అనుమానాలు కూడా నిజ‌మే. ఎందుకంటే ఈ చిత్రం అనుకున్న స‌మ‌యానికి విడుద‌ల కావ‌డం ఇప్పుడు క‌ష్ట‌మే. ఎందుకంటే ఇందులో సిజి వ‌ర్క్ ఇంకా బ్యాలెన్స్ ఉంద‌ని.. షూటింగ్ అంతా అయినా కూడా గ్రాఫిక్స్ మాత్రం ఇంకా న‌డుస్తూనే ఉంద‌ని.. ఇంకా 15 రోజుల్లో అది పూర్తి కావ‌డం దాదాపు అసాధ్యం అని తెలుస్తుంది. దాంతో మ‌రో డేట్ చూసుకోవాల‌ని చూస్తున్నాడు సంక‌ల్ప్ రెడ్డి. 

డిసెంబ‌ర్ 21 నుంచి వాయిదా వేసి ఏకంగా వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో ఈ చిత్ర విడుద‌ల‌కు స‌న్నాహాలు చేస్తున్నారు. అయితే దీనిపై ఇంకా అఫీషియ‌ల్ క‌న్ఫ‌ర్మేష‌న్ మాత్రం రాలేదు. ఇప్పుడు అందుతున్న స‌మాచారం ప్ర‌కారం మాత్రం క‌చ్చితంగా అంత‌రిక్షం అనుకున్న స‌మ‌యానికి రావ‌డం మాత్రం అసాధ్య‌మే. కానీ దీన్ని సుసాధ్యం చేయ‌డానికి టీం అంతా క‌ష్ట‌ప‌డుతున్నారు. వ‌రుణ్ తేజ్ కూడా ఈ చిత్రం అనుకున్న టైమ్ కు వ‌స్తే బాగుంటుంది అనుకుంటున్నాడు కానీ అది వ‌చ్చేలా క‌నిపించ‌డం లేదు. దానికోసం టీం అంతా మ్యాగ్జిమం ట్రై చేస్తున్నారు. మ‌రి చూడాలిక‌.. చివ‌రికి ఏం జ‌రుగుతుందో..? అంత‌రిక్షం వ‌స్తుందో రాదో.. వ‌స్తే మాత్రం ప‌డిప‌డి లేచే మ‌న‌సుతో పోటీ ప‌డాల్సి వ‌స్తుంది. లేదంటే సోలోగా ఎక్క‌డో త‌ర్వాత రావాల్సి వ‌స్తుంది. 

More Related Stories