English   

వరుణ్ తేజ్ మళ్లీ క్లబ్ లో జాయిన్ అయ్యాడు

varun tej

మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన స్టార్ వరుణ్ తేజ్. కానీ ఫస్ట్ మూవీ నుంచే అందరికంటే భిన్నమైన దారిలో వెళుతున్నాడు. కానీ అతనికి సక్సెస్ వెంటనే రాలేదు. కాస్త లేట్ అయినా లేటెస్ట్ గా అన్నట్టుగా ఫిదాతో మెమరబుల్ హిట్ వచ్చింది. కానీ ఆ సినిమా సక్సెస్ క్రెడిట్ అంతా సాయి పల్లవికే వెళ్లింది. ఏమాటకామాటే.. ఫస్ట్ హాఫ్ లో సాయి పల్లవి డామినేట్ చేసినా.. సెకండ్ హాఫ్ లో దుమ్మురేపాడు వరుణ్ తేజ్. కానీ శేఖర్ కమ్ముల, సాయి పల్లవి, దిల్ రాజుల వల్ల వరుణ్ కు వచ్చిన షేర్ తక్కువ. మొత్తంగా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ఫిదా.. ఓవర్శీస్ లో కూడా అదరగొట్టింది. అక్కడ ఏకంగా ఒన్ మిలియన్ వసూలు చేసింది. ఇది వరుణ్ కు ఫస్ట్ మిలియన్. క్రెడిట్ పూర్తిగా తన ఖాతాలో లేకపోయినా.. ఇది వరుణ్ తేజ్ కు ఫస్ట్ మిలియన్ మూవీగా నిలిచింది. ఇప్పుడీ మిలియన్ క్లబ్ లో తొలిప్రేమ కూడా చేరింది.

ఫిదాతో వచ్చిన క్రేజ్ ను డబుల్ చేసుకుంటూ తొలిప్రేమతో తిరుగులేని హిట్ అందుకున్నాడు. తనలోని మంచి నటుడ్ని కూడా మరోసారి చూపించాడు. డే వన్ నుంచే మంచి టాక్ తో దూసుకుపోయిన తొలిప్రేమ ఓవర్సీస్ లో కూడా దుమ్మురేపింది. దీంతో ఈ రోజుతో తొలిప్రేమ ఒన్ మిలియన్ క్లబ్ లో చేరింది. ఈ సినిమాతో రెండో సారి మిలియన్ క్లబ్ లో చేరిపోయాడు వరుణ్ తేజ్. వరుణ్ సెలెక్ట్ చేసుకుంటోన్న సబ్జెక్ట్స్ చూస్తుంటే ఖచ్చితంగా ప్రామిసింగ్ స్టార్ గా ఎదిగేలా ఉన్నాడు. నెక్ట్స్ ఘాజీ ఫేమ్ సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో ఫస్ట్ స్పేస్ మూవీ చేస్తున్నాడు. దీనికోసం జార్జియా దేశంలో స్పేస్ సెట్టింగ్ వేస్తున్నారు. అక్కడే ఆ పరిస్థితుల్లో ఉండేవారు ఎలా ఉంటారో అలా ట్రెయినింగ్ అవుతున్నాడు. ఏదేమైనా తొలిప్రేమకు ఇంకా బాగా ప్రమోషన్ చేసి ఉంటే వరుణ్ ఇంకా తొందరగానే సెకండ్ మిలియన్ క్లబ్ లోకి ఎంటర్ అయ్యి ఉండేవాడే.. 

More Related Stories