English   

వ‌రుణ్ ఎలా అమ్ముతాడో ఏంటో..?

Varun Tej brand ambssador to R.S. Brothers

మెగా ఫ్యామిలీ నుంచి న‌యా స్టార్ పుట్టుకొచ్చాడు ఇప్పుడు. అత‌డి పేరు వ‌రుణ్ తేజ్. ఏడాది కింది వ‌ర‌కు ఒక్క హిట్ కూడా లేదు ఈ హీరోకు. ఈ కుర్ర హీరో అస‌లు హీరోగా నిల‌బ‌డతాడా అనే అనుమానాలు కూడా వ‌చ్చాయి. కానీ ఫిదాతో స‌గం.. తొలిప్రేమ‌తో మ‌రో స‌గం అనుమానాలు అంద‌రికీ తీర్చేసాడు వ‌రుణ్ తేజ్. తాను ప‌క్కా హీరో మెటీరియ‌ల్ అని ప్రూవ్ చేసుకున్నాడు. ప్ర‌స్తుతం సంక‌ల్ప్ రెడ్డితో అంత‌రిక్షం సినిమా చేస్తున్నాడు. టైటిల్ కూడా అదే. క్రిష్ దీనికి నిర్మాత‌. దాంతోపాటు ఎఫ్ 2లోనూ న‌టిస్తున్నాడు. వెంక‌టేశ్ ఇందులో మ‌రో హీరో. అనిల్ రావిపూడి ద‌ర్శ‌కుడు. ఇలా వ‌ర‌స సినిమాల‌తో బిజీగా ఉన్న వ‌రుణ్ తేజ్.. ఇప్పుడు బ్రాండ్ అంబాసిడ‌ర్ గా కూడా మారిపోయాడు. ఈయ‌న తన తొలి బ్రాండ్ ఆర్ఎస్ బ్ర‌ద‌ర్స్ కు సైన్ చేసాడు. ఇప్ప‌టి వ‌ర‌కు ఎండోర్స్ మెంట్ అనుభ‌వం లేని వ‌రుణ్ తేజ్.. ఇక‌పై మా బ‌ట్టల షాప్ కు రండి.. న‌చ్చిన బ‌ట్ట‌లు తీసుకుని పోండి అంటూ చెప్ప‌బోతున్నాడు. మ‌రి ఈ కుర్ర హీరో ఎలా బ‌ట్ట‌ల‌న్నీ అమ్ముతాడో చూడాలిక‌..!

More Related Stories