English   

వ‌రుణ్ తేజ్.. ఏం దూకుడు సామీ నీది..? 

varun tej- sankalp

వ‌ర‌స‌గా రెండు విజ‌యాలు వ‌చ్చాయో లేదో అప్పుడే దూకుడు పెంచేసాడు వ‌రుణ్ తేజ్. ఫిదా.. వెంట‌నే తొలిప్రేమ‌తో వ‌రుణ్ బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకున్నాడు. ఇప్పుడు ఈ కుర్ర హీరో కెరీర్ సూప‌ర్ ఫాస్ట్ గా సాగిపోతుంది. విజ‌యాలు వ‌స్తున్నాయి క‌దా క‌మ‌ర్షియ‌ల్ క‌థ‌ల వైపు అడుగులు వేయ‌డం లేదు ఈ హీరో. సింపుల్ గా త‌న‌కు న‌చ్చిన క‌థ‌ల‌నే ఎంచుకుంటున్నాడు. ఇప్పుడు ఘాజీ ఫేమ్ సంక‌ల్ప్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌బోతున్నాడు వ‌రుణ్. ఇది స్పేస్ నేప‌థ్యంలో సాగే సినిమా. ఇందులో వ్యోమ‌గామిగా న‌టించ‌బోతున్నాడు వ‌రుణ్ తేజ్. దీనికోస‌మే క‌జ‌కిస్థాన్ లో మూడు నెల‌ల పాటు జీరో గ్రావిటీలో శిక్ష‌ణ తీసుకుంటున్నాడు వ‌రుణ్ తేజ్. ప్ర‌స్తుతం ఇదే ప‌నిమీదే ఉన్నాడు ఈ హీరో. మే లో ఈ సినిమా ప‌ట్టా లెక్క‌బోతుంది. ఈ చిత్రం ఇంకా అలాగే ఉంది అప్పుడే మ‌రో సినిమాకు కూడా సై అనేసాడు ఈ హీరో. అయ్యారే లాంటి చిత్ర‌మైన సినిమా చేసిన సాగ‌ర్ చంద్ర‌తో ఓ సినిమా చేయ‌బోతున్నాడు వ‌రుణ్ తేజ్. ఈ ద‌ర్శ‌కుడు చెప్పిన క‌థ వ‌రుణ్ కు న‌చ్చడంతో ట్రాక్ రికార్డ్ తో ప‌నిలేకుండా అవ‌కాశం ఇచ్చేసాడు మెగా హీరో. ఇక అనిల్ రావిపూడి ఎఫ్ 2లోనూ వ‌రుణ్ తేజ్ ఓ హీరోగా న‌టిస్తాడ‌నే ప్ర‌చారం జ‌రుగుతుంది. మొత్తానికి వ‌ర‌స సినిమాల‌తో దూకుడు చూపిస్తున్నాడు ఈ కుర్ర హీరో. 

More Related Stories