English   

కుర్రాడి ఫ్ర‌స్టేష‌న్ పీక్స్ లో ఉందిగా.. 

Varun-venki
2018-03-26 13:48:18

ఈ రోజుల్లో ఒక్క హిట్ కొట్ట‌డ‌మే గ‌గ‌నంగా మారిపోయింది. అలాంటిది వ‌ర‌స‌గా మూడు విజ‌యాలు అందుకున్నాడు అనిల్ రావిపూడి. అది కూడా ప‌క్కా రొటీన్ క‌మ‌ర్షియ‌ల్ క‌థ‌లతో. ఒక్కో సినిమాలో ఒక్కో క‌థ‌.. కానీ అన్నింట్లోనూ ఎంట‌ర్ టైన్మెంట్ కామ‌న్. ప‌టాస్.. సుప్రీమ్.. రాజా ది గ్రేట్.. ఈ మూడు సినిమాలు చాలు.. అనిల్ రావిపూడి ఏంటో చెప్ప‌డానికి. ర‌చ‌యిత‌గా ఉన్న‌పుడు విజ‌యం రాలేదు కానీ ద‌ర్శ‌కుడిగా మారాక ప‌రాజ‌యం భ‌య‌ప‌డుతుంది మ‌నోడిని చేర‌డానికి. రాజా ది గ్రేట్ త‌ర్వాత అనిల్ రేంజ్ పెరిగిపోయింది. మ‌నోడు ఓకే అనాలే కానీ స్టార్స్ కూడా సై అంటున్నారు ఈ ద‌ర్శ‌కుడితో ప‌ని చేయ‌డానికి. అయితే ఒకేసారి స్టార్స్ ను ప‌ట్టేసి స్టార్ డైరెక్ట‌ర్ అయిపోవాల‌నే ఆలోచ‌న ఈ కుర్రాడికి లేన‌ట్లుంది. అందుకే ఒక్కో మెట్టు ఎక్కుతున్నాడు. ఇప్పుడు ఈయ‌న ఓ మ‌ల్టీస్టార‌ర్ సినిమాకు శ్రీ‌కారం చుడుతున్నాడు. దీనికి ఎఫ్ 2 అనే విచిత్ర‌మైన టైటిల్ కూడా పెట్టాడు. అంటే ఫ‌న్ అండ్ ఫ్ర‌స్టేష‌న్ అన్న‌మాట‌. 

ఇన్నాళ్లూ ప్రీ ప్రొడ‌క్ష‌న్ లోనే ఉన్న ఈ చిత్రానికి ఇప్పుడు అఫీషియ‌ల్ అనౌన్స్ మెంట్ వ‌చ్చింది. ముందు నుంచి అనుకుంటున్న‌ట్లే ఇందులో వెంక‌టేశ్, వ‌రుణ్ తేజ్ న‌టిస్తున్నారు. శ్రీ‌రామ‌న‌వ‌మి సంద‌ర్భంగా ఈ చిత్ర అనౌన్స్ మెంట్ వ‌చ్చింది. అనిల్ రావిపూడి గ‌తంలో వెంకీ హీరోగా న‌టించిన మ‌సాలా సినిమాకు మాట‌లు రాసాడు. అందులో వెంక‌టేశ్ ప‌లికిన బ‌ట్ల‌ర్ ఇంగ్లీష్ డైలాగులు బాగానే పేలాయి. ఆ ప‌రిచ‌యం ప్ల‌స్ ఇప్పుడు అనిల్ ట్రాక్ రికార్డ్ చూసి అత‌డికి వెంకీ ఓకే చెప్పాడు. ఇక వ‌రుణ్ తేజ్ కు దిల్ రాజు గాడ్ ఫాద‌ర్. ఆయ‌న రెండు విజ‌యాలు ఈ కంపౌండ్ నుంచి వ‌చ్చిన‌వే. ఇక ఈ ఇద్ద‌రి కాంబినేష‌న్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. క‌చ్చితంగా ఈ సినిమాతో అనిల్ వ‌ర‌స‌గా నాలుగో విజ‌యం అందుకోవ‌డం ఖాయం అంటున్నాడు దిల్ రాజు. మ‌రి చూడాలిక‌.. ఈ ఫ‌న్ అండ్ ఫ్ర‌స్టేష‌న్ ఎలా ఉండ‌బోతుందో..? 

More Related Stories