English   

ఓవ‌ర్సీస్ లో వ‌రుణ్ బ్యాక్ టూ బ్యాక్..

varun tej

ఓవ‌ర్సీస్ మార్కెట్ తెచ్చుకోవ‌డం అంటే అంత చిన్న విష‌యం కాదు. ఇక్క‌డ క‌లెక్ష‌న్లు కుమ్మేసే రామ్ చ‌ర‌ణ్ కు ఇప్ప‌టి వ‌ర‌కు ఓవ‌ర్సీస్ లో స‌రైన మార్కెట్ లేదు. ఇక బాల‌య్య సినిమాల‌ను అక్క‌డ ప‌ట్టించుకోరు. ఎంతోమంది స్టార్ డైరెక్ట‌ర్ల‌కు కూడా విదేశీ మార్కెట్ లేదు. అక్క‌డి ప్రేక్ష‌కుల‌కు న‌చ్చాలంటే దానికి మ‌రో స్థాయి ఉండాలి. ఇప్పుడు ఆ స్థాయి అందుకున్నాడు వ‌రుణ్ తేజ్. ఈయ‌న న‌టించిన తొలిప్రేమ మిలియ‌న్ మార్క్ అందు కుంది. వ‌ర‌స‌గా రెండు సార్లు ఈ ఫీట్ అందుకున్నాడు వ‌రుణ్ తేజ్. గ‌తేడాది ఫిదాతో ఏకంగా 2 మిలియ‌న్ మార్క్ అందుకున్న వ‌రుణ్.. ఇప్పుడు మిలియ‌న్ మార్క్ అందుకున్నాడు. తొలిప్రేమ జోరు చూస్తుంటే అక్క‌డ ఈజీగా 1.3 మిలియ‌న్ వ‌ర‌కు వ‌సూలు చేయ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది. ఈ సినిమాతో ఓవ‌ర్సీస్ ఆడియ‌న్స్ ప్రేమ‌లో ప‌డిపోయారు.

కొత్త ద‌ర్శ‌కుడే అయినా కూడా ఈ సినిమాను వెంకీ అట్లూరి తెర‌కెక్కించిన విధానం చాలా బాగుంది. వ‌ర‌ణ్ తేజ్, రాశీఖ‌న్నా మ‌ధ్య కుదిరిన కెమిస్ట్రీ సినిమాను మ‌రో స్థాయికి తీసుకెళ్లింది. ఓవ‌ర్సీస్ లోనే కాదు.. ఇండియాలోనూ అద్భుత‌మైన వ‌సూళ్లు సాధిస్తుంది తొలిప్రేమ‌. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ సినిమా 24 కోట్ల‌కు పైగా షేర్ సాధించింది. ఈ చిత్రం సేఫ్ అవ్వాలంటే 22.5 కోట్లు రావాలి. ఇప్ప‌టికే వ‌చ్చేసాయి. ఈ లెక్క‌న వ‌రుణ్ తేజ్ మ‌రో హిట్ కొట్టాడ‌న్న‌మాట‌. మొత్తానికి మెగా ఫ్యామిలీ నుంచి మ‌రో హీరో స్టార్ గా మారిపోయాడు. 

More Related Stories