English   

జూలై 30న రింగులోకి దిగబోతున్న గని 

Varun Tej Ghani
2021-01-28 14:36:02

మెగా ప్రిన్స్‌ వరుణ్‌తేజ్‌ బాక్సర్‌గా నటిస్తున్న  చిత్రం 'గని'. లేటెస్ట్ గా ఈ  సినిమా జూలై 30న విడుదల చేయనున్నట్లుగా ప్రకటించింది చిత్రబృందం. ఈ సినిమాకు కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్నారు. అల్లు బాబీ మరియు సిద్దు ముద్దలు నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ఉపేంద్ర, సునీల్ శెట్టి, జగపతి బాబు కీలక పాత్రలలో నటించనున్నారు. ఇందులో బాలీవుడ్ నటుడు మహేష్ మంజ్రేకర్ కూతురు సయూ మంజ్రేకర్ హీరోయిన్‏గా నటిస్తుంది. ఎస్ఎస్ తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇక వరుణ్‌తేజ్‌ మరోవైపు విక్టరీ వెంకటేష్‌తో కలిసి ఎఫ్‌3లో నటిస్తున్నాడు. ఈ సినిమాకు అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్న ఈ సినిమా వేసవిలో ప్రేక్షకుల మందుకు రాబోతుంది.

More Related Stories