English   

వరుణ్ తేజ్ కు అంతరిక్షం ఫైనల్

varun Tej movie Anthariksham
2018-06-05 22:16:47

కథకు తగ్గ టైటిల్ ఎప్పుడూ ప్లస్ అయ్యేదే. ఇది కంటెంట్ బేస్డ్ సినిమాలకైతే ఇవి ఇంకా ప్లస్ అవుతాయి. అలా ఉన్నప్పుడు ఆడియన్ కు ఏ కన్ఫ్యూజన్ ఉండదు. అందుకే సంకల్ప్ రెడ్డి ఫస్ట్ మూవీకి ఏకంగా తన కథనే టైటిల్ గా పెట్టాడు. అదే ఘాజీ. ఘాజీ  అనే పాకిస్తాన్ సబ్ మెరైన్ కు సంబంధించిన కథ కాబట్టి ఆ సినిమాకు ఈ టైటిల్ బిగ్గెస్ట్ ప్లస్ గా మారింది. ఇప్పుడు సంకల్ప్ రెడ్డి, వరుణ్ తేజ్ కాంబినేషన్ లో వస్తోన్న సినిమాకు కూడా అలాంటి టైటిల్ నే ఫిక్స్ చేసుకోబోతున్నారు. యస్.. వరుణ్, సంకల్ప్ కాంబోలోవస్తోన్న సినిమా స్పేస్ బ్యాక్ డ్రాప్ లో సాగే కథ అని ముందు నుంచీ చెబుతున్నారు. అందుకు తగ్గట్టుగానే ఈ సినిమాకు అదే టైటిల్ పెట్టేయబోతున్నారు.  

అంతరిక్షం నేపథ్యంలో సాగే కథ కాబట్టి..ఈ కథకు అదే టైటిల్ పెట్టబోతున్నారు. యస్.. వరుణ్, సంకల్ప్ సినిమా టైటిల్ గా ‘అంతరిక్షం’ అనే అనుకుంటున్నారు. నిజానికి ఇది అన్ని వర్గాలకూ కనెక్ట్ అయ్యే టైటిల్. పైగా కథకు ఖచ్చితంగా యాప్ట్ అవుతుంది. అందుకే ఇదే టైటిల్ ను రిజిస్టర్ చేశారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తయిన ఈ అంతరిక్షం త్వరలోనే సెట్స్ పైకి వెళ్లబోతోంది. ఇక వరుణ్ సరసన లావణ్య త్రిపాఠీ, అదితిరావు హైదరీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక ఈ సినిమా ఖచ్చితంగా తెలుగులో ఓ కొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తుందనేది నిజం. 

More Related Stories