English   

వరుణ్ తేజ్, సంకల్ప్ డేట్ ఇచ్చేశారు

varuntej

ఫిదా, తొలిప్రేమ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో జోష్ లో ఉన్నాడు వరుణ్ తేజ్. ముందు నుంచీ సెలెక్టెడ్ స్క్రిప్ట్ తో వెళుతోన్న వరుణ్ ఈ సారి సంకల్ప్ రెడ్డితో జోడీ కట్టాడు. వీరి కాంబోలో వస్తోన్న సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. ఫస్ట్ ఇండియన్ సబ్ మెరైన్ మూవీ ఘాజీ తీసి దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నదర్శకుడు సంకల్ప్ రెడ్డి. ఈ ఇద్దరి కాంబినేషన్ లో ఇప్పుడు స్పేస్ బ్యాక్ డ్రాప్ లో సినిమా రాబోతోంది. ఖచ్చితంగా ఇది కూడా ఇండియన్ స్క్రీన్ పై సరికొత్త ఫీల్ నిచ్చే కథే అవుతుందని ఘాజీ చూసిన ఎవరికైనా అర్థమౌతుంది.

మొదట్లో జార్జియాలో షూటింగ్ చేయాలనుకున్నా.. ప్రస్తుతం రామోజీ ఫిలిమ్ సిటీలోనే సెట్స్ వేసి షూటింగ్ చేస్తున్నారు. ఈ కథపై ఫుల్ క్లారిటీ ఉన్న సంకల్ప్ చాలా వేగంగా చిత్రీకరణ పూర్తి చేస్తున్నాడు. అలాగే విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్ వర్క్ కూ ఎక్కువ స్కోప్ ఉన్న సినిమా కాబట్టి వీలైనంత తొరగా సినిమా పూర్తి చేసి అనుకున్న డేట్ కు రిలీజ్ చేయాలనుకున్నారు. అందుకే రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. ముందు నుంచీ ఈ ఫస్ట్ స్పేస్ బ్యాక్ డ్రాప్ మూవీని ఈ యేడాదే విడుదల చేస్తాం అని చెబుతోంది యూనిట్. అందుకు తగ్గట్టుగానే డిసెంబర్ 21న రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. ఈ సినిమా కోసం కొందరు హాలీవుడ్ టెక్నీషియన్స్ కూడా పని చేస్తుండటం విశేషం. లావణ్య త్రిపాఠీ, అదితిరావు హీరోయిన్లుగా నటిస్తోన్న ఈమూవీ డిసెంబర్ 21న విడుదలవుతోందంటే ఖచ్చితంగా అది మంచి డేటే అనుకోవచ్చు. 
 

More Related Stories