English   

వ‌రుణ్ ఏం మారిపోయాడ‌బ్బా..!

varun-tej

ఇన్నాళ్లూ మ‌నం చూసిన హీరోకు.. ఇప్పుడు మ‌నం చూస్తున్న హీరోకు చాలా మార్పులు క‌నిపిస్తున్నాయి. సినిమా కోసం పూర్తిగా మారిపోయాడు వ‌రుణ్ తేజ్. ఈయ‌న ప్ర‌స్తుతం రెండు సినిమాల్లో న‌టిస్తున్నాడు. ఇందులో ముందుగా సంక‌ల్ప్ రెడ్డి సినిమాను మొద‌లు పెడ‌తాడు. ఇది స్పేస్ నేప‌థ్యంలో సాగే క‌థ‌. ఇందులో వ్యోమ‌గామిగా న‌టిస్తున్నాడు వ‌రుణ్ తేజ్. ఈ పాత్ర కోసం త‌న‌ను తాను చాలా సిద్ధం చేసుకున్నాడు ఈ కుర్ర హీరో. తాజాగా ఈయ‌న ఫిజిక్ కూడా మారిపోయింది. కండ‌లు తిరిగిన దేహంతో మ‌నోడు హాలీవుడ్ హంక్ లా ఉన్నాడు. సంక‌ల్ప్ సినిమా కోస‌మే ఆ మ‌ధ్య  క‌జ‌కిస్థాన్ వెళ్లి మూడు నెల‌ల పాటు జీరో గ్రావిటీలో శిక్ష‌ణ తీసుకున్నాడు కూడా. ఇదే నెల‌లో ఈ సినిమా ప‌ట్టాలెక్క‌బోతుంది. ఇదిలాగే ఉంది.. అనిల్ రావిపూడితో ఎఫ్ 2 కూడా చేయ‌నున్నాడు. ఇది జూన్ నుంచి ప‌ట్టాలెక్క‌నుంది. వెంక‌టేశ్ ఇందులో మ‌రో హీరో. మెహ్రీన్ తో వ‌రుణ్.. త‌మ‌న్నా తో వెంక‌టేశ్ న‌టించ‌బోతున్నారు. ఇక ఈ రెండు సినిమాల‌తో పాటు అయ్యారే లాంటి చిత్ర‌మైన సినిమా చేసిన సాగ‌ర్ చంద్ర‌తో ఓ సినిమా చేయ‌బోతున్నాడు వ‌రుణ్ తేజ్. ఈ ద‌ర్శ‌కుడు చెప్పిన క‌థ వ‌రుణ్ కు న‌చ్చడంతో ట్రాక్ రికార్డ్ తో ప‌నిలేకుండా అవ‌కాశం ఇచ్చేసాడు మెగా హీరో. మొత్తానికి వ‌రుణ్ దూకుడు ఇప్పుడు మామూలుగా లేదు.

More Related Stories