English   

వరుణ్ తేజ్ అహం బ్రహ్మస్మి...

Sankalp Reddy-varun tej

మెగా హీరోల్లో లేట్ గా సక్సెస్ లోకి వచ్చిన స్టార్ వరుణ్ తేజ్. లేట్ అయినా లేటెస్ట్ గా అన్నట్టుగా కుమ్మేస్తున్నాడు. లాస్ట్ ఇయర్ ఫిదాతో టెరిఫిక్ హిట్ అందుకున్న వరుణ్ లేటెస్ట్ గా తొలిప్రేమతో బాబాయ్ రేంజ్ హిట్ అందుకున్నాడు. ఆ తొలిప్రేమ పవన్ కళ్యాణ్ కెరీర్ ను ఎలా టర్న్ తిప్పిందో ఇప్పుడు వరుణ్ కు ఈ తొలిప్రేమా అలాగే మారింది. అందుకే వరుణ్ ఖుషీగా ఉన్నాడిప్పుడు. కానీ అతనితో సినిమాలు చేయాలనుకుంటోన్న నిర్మాతలే షాక్ అవుతున్నారు. కారణం అతను రెమ్యూనరేషన్ భారీగా పెంచడమే..

ఫస్ట్ నుంచి సెలెక్టెడ్ మూవీస్ తో చెలరేగిపోతున్నాడు వరుణ్. మెగా హీరోలు అనగానే ఉండే రొటీన్ మాస్ ఇమేజ్ కు మొదట్లోనే కంచెలు వేసుకున్న వరుణ్ నెక్ట్స్ చేయబోయే సినిమాను కూడా ఎక్స్ పర్మంటల్ గానే చేయబోతున్నాడు. ఘాజీతో ఎంటైర్ ఇండస్ట్రీని ఎట్రాక్ట్ చేసిన సంకల్ప్ రెడ్డితో వరుణ్ నెక్ట్స్ మూవీ చేయబోతున్నాడు. ఇది స్పేస్ నేపథ్యంలో సాగే సినిమా. తెలుగులో ఈ జానర్ లో ఇదే ఫస్ట్ మూవీ. అందుకే వీలైనంత బెస్ట్ ఇచ్చేందుకు టీమ్ మొత్తం చాలా కష్టపడుతోంది. స్పేస్ మూవీ అంటే గురుత్వాకర్షణ శక్తి లేని చోటుగా చూపించాలి. అంటే మనుషులు మాగ్జిమ గాల్లోనే వేలాడుతూ ఉండాలి. ఇందుకోసం స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంటున్నాడు వరుణ్. ఇక ఈ మూవీకి ‘అహం బ్రహ్మస్మి’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు టాలీవుడ్ టాక్. టీమ్ అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు కానీ.. ఇదే ఫైనల్ అని స్ట్రాంగ్ గా వినిపిస్తోంది. ఈ సినిమాకు వరుణ్ తీసుకుంటోన్న రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా.. నాలుగు కోట్లు..

నిన్నటి వరకూ వరుణ్ పారితోషికం రెండున్నర కోట్లు. కానీ ఫిదా, తొలిప్రేమతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ రావడంతో ఏకంగా కోటిన్నర రెమ్యూనరేషన్ ఒకేసారి పెంచేశాడు. దీంతో ఇప్పుడిప్పుడే అంత పెంచడనుకుని కథలు రాసుకున్న దర్శకులు, ఆ దర్శకులకు సపోర్ట్ చేయాలనుకున్న నిర్మాతలకూ ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. ఏదేమైనా అంతరిక్షం సాగే కథకు అహం బ్రహ్మస్మి అనే టైటిల్ యాప్ట్ గా ఉంటుంది. ఆ టైటిల్ వెనక, ఈ కథతో కంపేర్ చేస్తే కథానుగుణంగా ఎన్నో అర్థాలు ఇప్పుడే తెలుస్తున్నాయి.. అంటే సినిమాలో ఇంకెన్ని మానవాతీత విషయాలు చూపిస్తారో.. 

More Related Stories