English   

బికినీ బేబ్ తో వరుణ్ తేజ్

Varun-Tej
2018-03-13 08:52:24

ఇండస్ట్రీకి లేట్ గా వచ్చింది కానీ.. ఈ సోయగాలకు చాలామంది ఫిదా అయిపోయేవారు. ఇప్పటికైనా ఏముందిలే.. కాస్త లేట్ అయినా అమ్మడికి వరుసగా ఆఫర్స్ వస్తున్నాయి. ఇన్నాళ్లూ హాట్ హాట్ ఫోటోషూట్స్ తో బికినీ ఫోజెస్ తో రెచ్చగొట్టిన హైదరాబాదీ సెక్సీ బ్యూటీ అదితిరావు హైదరికి ఫైనల్ గా ఆఫర్స్ పెరుగుతున్నాయి. మణిరత్నం చెలియాలో మెస్మరైజ్ చేసిన ఈ బ్యూటీ బాలీవుడ్ బ్లాక్ బస్టర్ పద్మావత్ లోనూ ఆకట్టుకుంది. ప్రస్తుతం తెలుగులో మోహనకృష్ణ ఇంద్రగంటి డైరెక్షన్ లో సుధీర్ బాబు హీరోగా రూపొందుతోన్న సమ్మోహనం సినిమాలో నటిస్తోంది. ఈ మూవీ జూన్ లో విడుదల కాబోతోంది. దీంతో పాటు మణిరత్నం మళ్లీ మరో చాన్స్ ఇచ్చాడీ బ్యూటీకి. తన దర్శకత్వంలో మల్టీస్టారర్ గా రూపొందుతోన్న నవాబ్ సినిమాలో అదితినీ తీసుకున్నాడు. ఇవి కాక ఈ హైదరాబాదీ సోయగానికి లేటెస్ట్ గా వరుణ్ తేజ్ మూవీలో ఛాన్స్ వచ్చింది. ఇన్నాళ్లూ బాలీవుడ్ కలలతో సగం కెరీర్ డ్యామేజ్ చేసుకున్న అదితికి సౌత్ లో ఊహించని ఆఫర్స్ పెరుగుతున్నాయి. 

ఘాజీ ఫేమ్ సంకల్ప్ రెడ్డి డైరెక్షన్ లో రూపొందబోయే స్పేస్ థ్రిల్లర్ మూవీలో వరుణ్ తేజ్ సరసన అదితిని హీరోయిన్ గా తీసుకున్నారు. ఈ స్పేస్ థ్రిల్లర్ లో మరో హీరోయిన్ కూ స్పేస్ ఉంది. కానీ మెయిన్ బ్యూటీ మాత్రం ఈ బికినీ సుందరే. మొత్తంగా పెళ్లి చేసుకుని, తర్వాత విడాకులు తీసుకుని ఆపై సినిమాల్లోకి వచ్చిన ఈ సొగసరి ఒక మంచి అవకాశం కోసం చాన్నాళ్లు వెయిట్ చేసింది. ఫైనల్ గా మణిరత్నం మ్యాజిక్ తో మెల్లగా కెరీర్ స్పీడందుకుంటోంది. ఇటు తెలుగులోనూ ఆఫర్స్ పెరుగుతున్నాయి కాబట్టి.. ఇకనైనా అదితి బాలీవుడ్ డ్రీమ్స్ కు ఫుల్ స్టాప్ పెడితే మంచిదేమో.. 
 

More Related Stories