English   

వరుణ్ తేజ్ ‘సెట్ స్పేస్’

Varun-Tej- Space

వరుణ్ తేజ్.. మంచి కథలు సెలెక్ట్ చేసుకుంటూ స్ట్రాటజీ పెంచుకుంటూ వెళుతున్నాడు. వైవిధ్యమైన కథలంటే ముందు నుంచీ ఇంట్రెస్టింగ్ గా ఉన్న వరుణ్ లేటెస్ట్ గా స్పేస్ బ్యాక్ డ్రాప్ లోఓ స్టోరీ చేస్తున్నాడు. ఘాజీ ఫేమ్ సంకల్ప్ రెడ్డి డైరెక్ట్ చేయబోతోన్న ఈ మూవీలో చాలా భాగం స్పేస్ లోనే సాగుతుందని ముందు నుంచీ చెబుతున్నారు. ఇందు కోసం ఓ జార్జియా దేశంలో సెట్స్ వేసి.. అక్కడే షూటింగ్ చేయాలనుకున్నారు. అందుకోసం ఆల్రెడీ వరుణ్ అండ్ టీమ్ అక్కడికి వెళ్లి కొన్నాళ్ల పాటు స్పేస్ లో ఉండే వ్యక్తుల బాడీ లాంగ్వేజ్ కు సంబంధించిన ట్రెయినింగ్ కూడా తీసుకున్నారు. అయితే లేటెస్ట్ గా ఈ మూవీకి సంబంధించి జార్జియా ఎపిసోడ్ క్యాన్సిల్ అయిందని వినిపిస్తోంది. అందుకు కారణం రంగస్థలం కావడం విశేషం. 

లేటెస్ట్ గా వచ్చిన రంగస్థలం మూవీ విలేజ్ సెట్ చూశారు కదా.. నిజంగానే గోదారి ఒడ్డున ఉందా అన్నట్టుగా ఉంటుందా సెట్. ఇంత గొప్ప సెట్ వేసేవాళ్లు మన దగ్గరే ఉండగా.. జార్జియా ఎందుకు దండగ అనుకుందట ఈ స్పేస్ మూవీ టీమ్. అందుకే ఆ సెట్టేదే ఇక్కడే వేసుకుంటే పోలా అని ఫిక్స్ అయ్యారని సమాచారం. ఇలాంటి సెట్స్ వేయించడంలో కూడా సంకల్ప్ ఎక్స్ పర్ట్. అందుకే రంగస్థలం ఆర్ట్ వర్క్ చేసిన రామకృష్ణ, మౌనికల ను పిలిచి తమ సినిమా కాన్సెప్ట్ చెప్పినట్టు టాక్. ఆ కాన్సెప్ట్ కు తగ్గట్టుగా ఈ సెట్ లో రాకెట్ లాంచర్స్, ఇస్రో నుంచి శాటిలైట్స్ పింపించే బిల్డప్ లాగా కొన్ని సెట్స్ ఇక్కడే వేయబోతున్నారట. అయితే దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. మొదట బడ్జెట్ తగ్గుతుంది. తర్వాత మన రేంజ్ ఇతర సినిమా పరిశ్రమలకు తెలుస్తుంది. అలాగే ఆ సెట్ ఏరియా ఓ టూరిస్ట్ స్పాట్ లా మారుతుంది. సో..వరుణ్ తేజ్ స్సేస్ సెట్ జార్జియా నుంచి హైదరాబాద్ కే వచ్చేసిందన్నమాట. 

More Related Stories