English   

వరుణ్ తేజ్ వీటిని తట్టుకుంటాడా..?

Varun-Tej
2018-02-16 15:42:36

తొలిప్రేమ.. ఫస్ట్ డేనే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. వరుణ్ తేజ్ నటనకు అంతా ఫిదా అయిపోతున్నారు. కథ, కథనం అంతా మెచ్యూర్డ్గ్ గా ఉందనే టాక్ తెచ్చుకుంది. మరవైపు అతనితో పాటు విడుదలైన ఏ సినిమా కూడా కనీసం నిలబడే పరిస్థితి లేదు. కానీ ఇప్పుడు తొలిప్రేమకు అసలు పరీక్ష ఎదురుకాబోతోంది. ఈశుక్రవారం ఏకంగా నాలుగు సినిమాలు విడుదలవుతున్నాయి. వీటిలో నాని నిర్మించిన అఁ, మహేష్ బాబు సపోర్ట్ తో మంజుల డైరెక్ట్ చేసిన మనసుకు నచ్చిందితో పాటు మరో రెండు చిన్న సినిమాలూ విడుదల కాబోతున్నాయి. వీటిని తట్టుకుంటే కానీ తొలిప్రేమ అతని కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలవలేదు. ఒకవేళ ఈ సినిమాల్లో దేనికైనా పెద్ద క్రేజ్ వస్తే మాత్రం తొలిప్రేమ కలెక్షన్లు డ్రాప్ అవుతాయి. 

ఇది తట్టుకోవడానికే చరణ్ కూడా మెగా టీమ్ ను రంగంలోకి దింపేశాడు. చిరంజీవి, రామ్ చరణ్ తేజ్ ఈ సినిమాను ప్రెయిజ్ చేస్తూ ప్రెస్ మీట్లు పెట్టేశారు. ఇవి ఖచ్చితంగా రేపటి పోటీని తట్టుకునేందుకు ఉపయోగపడతాయి. కానీ ఆ సినిమాల్లో ఏవైనా బావున్నాయంటే మాత్రం ఖచ్చితంగా దెబ్బే. బట్ ఇన్నర్ సోర్స్ ప్రకారం రేపు వస్తోన్న సినిమాల్లో ఏవీ పెద్ద పోటీ ఇచ్చే పరిస్థితి లేదట. మరి అదే నిజమైతే తొలిప్రేమకు ఈ వారం కూడా తిరుగుండదు. ఈ లోగా మనోడు మరింత ప్రమోషన్స్ చేసుకుంటే హిట్ రేంజ్ కూడా పెరుగుతుంది. 

More Related Stories