English   

అహం బ్రహ్మస్మి.. అంతా అబద్ధం

varun tej
2018-02-22 12:10:05

ఒక సినిమా కథ ఎలా ఉండబోతోందనేది ఆ సినిమా టైటిల్ ను బట్టి చెప్పొచ్చు. అందుకే టైటిల్స్ కు అంత ప్రియారిటీ ఇస్తుంటారు మనవాళ్లు. కొన్నిసార్లు ఈ టైటిల్ విషయంలో కన్ఫ్యూజన్ ఉంటుంది. అలా ప్రస్తుతం టాలీవుడ్ లో హల్ చల్ చేస్తోన్న హాట్ టైటిల్ అహం బ్రహ్మస్మి. ఈ టైటిల్ తో వరుణ్ తేజ్ సినిమా వస్తోందంటున్నారు కానీ.. అది నిజం కాదు. ఈ టైటిల్ కు వరుణ్ కు అసలు సంబంధమే లేదు. అసలు ఈ టైటిల్ ఎవరిది.. దాని వెనక కథేంటీ..?

అహం బ్రహ్మస్మి.. అదిరిపోయే టైటిల్. దీంతో ఎలాంటి కథైనా రాసుకోవచ్చు. దీని చుట్టూ ఎన్ని సన్నివేశాలైనా అల్లుకోవచ్చు. అందుకే ఇలాంటి యూనిక్ టైటిల్స్ వచ్చినప్పుడు కన్ఫ్యూజన్స్ పెరుగుతుంటాయి. ప్రస్తుతం ఈ అహం బ్రహ్మస్మి అనే టైటిల్ పై కూడా ఇలాంటి కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. ఈ టైటిల్ తో ఘాజీ ఫేమ్ సంకల్ప్ రెడ్డి దర్వకత్వంలో వరుణ్ తేజ్ సినిమా చేయబోతున్నాడని టాలీవుడ్ లో ఓ రూమర్ చక్కర్లు కొడుతోంది. కానీ ఆ టైటిల్ సంకల్ప్ దీ కాదు.. హీరో వరుణ్ తేజూ కాదు.. మరో స్టార్ డైరెక్టర్ ఈ టైటిల్ తో సినిమా చేయబోతున్నాడు. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. మరి ఆ దర్శకుడెవరో తెలుసా..?

క్రిష్ .. యస్.. క్రిష్ ఈ అహం బ్రహ్మస్మి అనే టైటిల్ తో సినిమా చేయబోతున్నాడు. ప్రస్తుతం అతను బాలీవుడ్ లో కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో ఝాన్సీ లక్ష్మీ బాయి జీవిత కథ మణికర్ణికను తెరకెక్కిస్తున్నాడు. ఆ సినిమా షూటింగ్ చాలా వేగంగా సాగుతోంది. మణికర్ణిక షూటింగ్ లో ఉంటూనే అహం బ్రహ్మస్మి ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా చేస్తున్నాడు. అయితే వరుణ్ తేజ్ ఈ టైటిల్ తో స్పేస్ బ్యాక్ డ్రాప్ లో సినిమా చేస్తాడనే రూమర్స్ వచ్చాయి. కానీ క్రిష్ అహం బ్రహ్మస్మి అనే కథ పూర్తిగా కమర్షియల్ ఎలిమెంట్స్ తో సాగుతుందట. హై టెక్నికల్ వాల్యూస్ కూడా ఉంటాయట. ఇందుకు సంబంధించిన పనులు కూడా జరుగుతున్నాయి. ఆగస్ట్ లో ప్రారంభం కానున్న ఈ మూవీ కోసం ఓ స్టార్ ను అప్రోచ్ అవబోతున్నాడు క్రిష్. అదీ మేటర్.. అంటే వరుణ్ తేజ్, స్పేస్ బ్యాక్ డ్రాప్, సంకల్ప్ రెడ్డి పేరుమీదుగా వినిపిస్తోన్న అహం బ్రహ్మస్మి వాస్తవం కాదన్నమాట.. 

More Related Stories