English   

సైలెన్స్ బ్రేక్ చేస్తానంటోన్న నారా రోహిత్

Veera-Bhoga-Vasantha-Rayalu-teaser
2018-08-22 12:40:54

వాళ్ల కోసం క్షణాలు గంటలు రోజులు కాదు.. నెలల తరబడి ఎదురు చూశారు. కానీ వాళ్లు రాలేదు. అందుకే ఇక సైలెన్స్ బ్రేక్ చేయాల్సిందే అంటున్నాడు నారా రోహిత్. మరి వాళ్లెవరు..? ఎక్కడికి వెళ్లారు. వారి వెనక ఉన్న సీక్రెట్ ఏంటీ..? సైలెన్స్ బ్రేక్ తర్వాత జరిగే విస్ఫోటనం ఏంటీ..? అన్నీ క్వశ్చన్సే కదూ.. ఇన్ని క్వశ్చన్స్ ను క్రియేట్ చేసేలా టీజర్ కట్ చేసి ఆకట్టుకుంటున్నారు వీరభోగవసంత రాయలు... 

నారా రోహిత్ వైవిధ్యమైన సినిమాలతో దూసుకువచ్చిన బాణం. తర్వాత అతనికి విల్లులా తోడయ్యాడు శ్రీ విష్ణు. ఇద్దరూ కలిసి అప్పట్లో ఇద్దరుండేవారు అని ముందు తరాల ప్రేక్షకులు చెప్పుకునేలా కొన్ని మంచి డిఫరెంట్ సినిమాలు చేస్తున్నారు. అందులో భాగంగా చేస్తున్నదే ఈ వీరభోగవసంత రాయలు. వీరితో పాటు సుధీర్ బాబు కూడా ఉన్నాడీ సినిమాలో. అలాగే పెళ్లి తర్వాత సబ్జెక్ట్ నచ్చి వెంటనే ఒప్పుకుని మరీ ఈ సినిమాలో నటిస్తోంది శ్రియ. ఈ నలుగురు ప్రధాన పాత్రల్లో వస్తోన్న ఈ మూవీ టీజర్ విడుదలైంది. 

నారా రోహిత్ డైలాగ్స్ తో మొదలైన ఈ టీజర్ చిన్నదే అయినా పెద్ద ఇంపాక్ట్ నే వేసింది. కల్ట్ రైజింగ్ అనే క్యాప్షన్ తో వస్తోన్న ఈ సినిమా ఎలా ఉంటుందో కానీ.. వీరభోగవసంత రాయలు లేట్ అయినా ఆకట్టుకున్నారు. ఇంద్రసేన ఆర్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో మనోజ్ నందం కూడా ఓ పాత్రలో కనిపించబోతున్నాడు. మొత్తం గా రోహిత్, శ్రీ విష్ణు కలిసి చేస్తోన్న డిఫరెంట్ జర్నీలో అప్పట్లో ఒకడుండేవాడు విపరీతమైన అప్లాజ్ తెచ్చుకుంది. మరి ఈ వీరభోగవసంతరాయలు ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి. 

More Related Stories