English   

వీరభోగవసంత రాయలు రివర్స్ లో ఉన్నాడే

Veera-Bhoga
2018-07-11 17:19:14

టాలీవుడ్ లో మల్టీస్టారర్స్ ఊపందుకున్నాయి. అయితే ఈ విషయంలో పెద్ద వారికంటే చిన్న స్టార్స్ కాస్త ఎక్కువ ఉత్సాహంగా ఉన్నారు. లాస్ట్ ఇయర్ శమంతకమణిలో నలుగురు కుర్ర హీరోలు నటించి మెప్పించారు. ఇప్పుడు మరో ముగ్గురు కుర్రాళ్లు కలిసి ‘వీరభోగవసంతరాయలు’అనే సినిమాతో రాబోతున్నారు. ‘కల్ట్ ఈజ్ రైజింగ్’ అనేది క్యాప్షన్. అనౌన్స్ అయిన దగ్గర్నుంచీ ఈ టైటిల్ పై చాలామంది ఆసక్తిగా చూశారు. ఈ నేపథ్యంలో ఈ మూవీ ఫస్ట్ లుక్ విడుదల చేశారు.. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అక్కడ ఉన్నది ఎవరో కనుక్కోవడం కష్టం అనేలా ఉందీ లుక్. ఆ మనిషి వేళ్లాడదీసి ఉన్నాడా.. లేక స్టిల్ అపోజిట్ గా పెట్టారా అనేది కూడా వెంటనే అర్థం కాదు.. మొత్తంగా ఈ లుక్ తో మరింత ఆసక్తిని పెంచిందీ మూవీ టీమ్. 

ముందు నుంచీ వైవిధ్యమైన సినిమాలే చేస్తోన్న నారా రోహిత్, శ్రీ విష్ణుతో పాటు సుధీర్ బాబు కూడా నటిస్తున్నాడు. అంటే ముగ్గురు హీరోలు. వీరికి తోడు సీనియర్ బ్యూటీ శ్రీయ శరన్ కూడా కీలక పాత్రలో నటిస్తోంది. పెళ్లి తర్వాత తను చేస్తోన్న సినిమా ఇది. అఫ్ కోర్స్ పెళ్లికి ముందే కమిట్ అయింది.. పూర్తిగా డిఫరెంట్ సబ్జెక్ట్ తో వస్తోన్న సినిమా ఇదని ముందు నుంచీ చెబుతున్నారు. మరి అదెంత నిజం అనేది సినిమా చెబుతుంది.. కానీ నిజమే అయ్యుండొచ్చేమో అనేలా ఈ పోస్టర్ ఉంది. ఇక అప్పారావు బెల్లెన నిర్మిస్తోన్న ఈ మూవీతో ఇంద్రసేన్ అనే కొత్త వ్యక్తి దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు. సో.. ఇప్పుడు వస్తోన్న యంగ్ టాలెంట్ టాలీవుడ్ మంచి కల్ట్ మూవీస్ అందిస్తున్నారు. మరి క్యాప్షన్ కూడా అదే పెట్టుకున్న  ఇంద్రసేన్ ఏ మేరకు మెప్పిస్తాడో చూడాలి. 

More Related Stories