English   

చిరంజీవి అల్లుడు చికెన్ సాంగ్ అదిరింది

Vijetha-chicken-song
2018-06-23 11:56:43

చికెన్ అంటే ఇష్టపడని వారెవరు. కానీ చికెన్ కోసం కోడి పడే బాధలు ఇప్పటి వరకూ ఎవరైనా పట్టించుకున్నారా..? కానీ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ పట్టించుకున్నాడు. పట్టించుకోవడమే కాదు.. పాపం కోడి త్యాగాన్ని కూడా కొనియాడుతూ.. ఓ పాట కూడా వేసుకున్నాడు.. అత్యంత సరదాగా.. చికెన్ తినని వారికి నచ్చేలా ఉన్న ఈ పాట లేటెస్ట్ గా విడుదల చేశారు. 

మనలో చికెన్ అంటే ఇష్టపడని వారెవరు.. కానీ ఎవరైనా ఎప్పుడైనా కోడి త్యాగాన్ని తలచుకుని ఇంతలా బాదపడ్డారా.. లేదు. కానీ ఈ కళ్యాణ్ దేవ్ చూశారా.. ఆ కోడి త్యాగాన్ని ఎంతలా పొగిడేస్తున్నాడో. చికెన్ లోని వెరైటీస్ మొదలుకుని.. అది వండే విధానాలన్నీ తలచుకుని ఓ ఇదైపోతున్నాడు. అన్నట్టు.. అతను చికెన్ లవర్స్ కే ఈ పాట అన్నాడు గానీ.. వింటే మాత్రం ఖచ్చితంగా ఆ చికెన్ సాంగ్ తో పాటు తినని వాళ్లు చికెన్ త్యాగానికి ఫిదా అయిపోతారు..

చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అవుతోన్న విజేత సినిమాలోని ఫస్ట్ లిరికల్ సాంగ్ ఇది. రాకేశ్ శశి అనే కుర్రాడు డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాను వారాహి బ్యానర్ పై సాయి కొర్రపాటి నిర్మిస్తున్నాడు. ఎవడే సుబ్రహ్మణ్యం, కళ్యాణ వైభోగమే ఫేమ్ మాళవిక నాయర్ హీరోయిన్ గా నటిస్తోంది. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తోన్న ఈ సినిమా వచ్చే నెలలో విడుదలకు సిద్ధమవుతోంది. త్వరలోనే ఆడియో ఫంక్షన్ కూడా జరగబోతోంది. ఏదేమైనా టీజర్ తో ఆకట్టుకున్న కళ్యాణ్ దేవ్ ఇప్పుడు పాటతో పడేశాడనే చెప్పాలి. 

More Related Stories