English   

వెంకటేష్ తో నాని గురూజీ డైరెక్షన్ లో

 Venkatesh Nani
2020-05-26 11:41:02

మన తెలుగు హీరోల్లో వెంకటేష్ అందరి హీరోల అభిమానులు అభిమానించే హీరో ఎవరున్నా ఉన్నాడా ? అంటే ఆయన వెంకటేష్ అని చెప్పచ్చు. ఈయనకి అజాత శత్రువు అనే పేరుంది. కెరీర్ మొదటి నుండి కూడా మల్టీస్టారర్‌ చిత్రాలకు కొత్త ఊపును తెచ్చిన వారిలో వెంకటేష్‌ ముందుంటారు. కెరీర్ మొదటి రోజుల నుండే ఈయన మల్టీస్టారర్ లు చేస్తూ మంచి పేరు తెచ్చుకున్నాడు. మొన్నటికి మొన్న మేనల్లుడు నాగచైతన్యతో వెంకీ మామ సినిమా చేసి హిట్ కొట్టాడు. అయితే ఈయన మరో కుర్ర హీరోతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోనున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఆ హీరో ఎవరో కాదు నేచురల్ స్టార్ నాని అని అంటున్నారు.  వీళ్లిద్దరి కోసమే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ ఓ అదిరిపోయే ఎంటర్ టైనర్ కథ సిద్ధం చేస్తున్నట్లు చెబుతున్నారు. 

ఇక ఈ సినిమాని త్రివిక్రమ్ కి క్లోజ్ అయిన హారిక హాసినీ క్రియేషన్స్‌తో కలిసి సురేష్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఇది ఎన్టీఆర్‌ 30 తర్వాతనే అని అంటున్నారు. ఎటూ ఆర్ఆర్ఆర్ లేట్ అవుతుంది, సో ఎన్టీఆర్ 30 కూడా, అందుకే ఈ రెండు సినిమాల స్క్రిప్ట్ లు పక్కాగా రెడీ చేసుకోవచ్చని భావిస్తున్నట్టు చెబుతున్నారు. ఎలాగూ వెంకీ ‘నారప్ప’, ‘ఎఫ్‌3’ చిత్రాలతో పాటు తరుణ్‌ భాస్కర్‌ దర్శకత్వంలోనూ ఓ సినిమా చేయాల్సి ఉంది. నాని చేతుల్లోనూ రెండు మూడు సినిమాలు ఉన్నాయి. సో టైం చూసుకుని ఈ సినిమా తెరకెక్కించవచ్చని అనుకుంటున్నారు.

More Related Stories