English   

నాని, వెంకటేష్.. ఓ మాటల మాంత్రికుడు..

nani
2020-05-26 07:15:29

తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు మల్టీస్టారర్ సినిమాలకు ఢోకా లేదు. రామ్ చరణ్, ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలే కలిసి నటిస్తున్నపుడు తమకేంటి అంటూ అంతా కలిసి నటించడానికి సిద్ధమైపోయారు. ఈ క్రమంలోనే ఇప్పుడు క్రేజీ మల్టీస్టారర్స్ వస్తున్నాయి. అందులో ఆచార్య కూడా ఒకటి. అందులో చిరంజీవితో కలిసి రామ్ చరణ్ నటిస్తున్నాడు. ఈ చిత్రంతో పాటే మరిన్ని కథలు కూడా సిద్ధం చేస్తున్నారు దర్శకులు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ కాంబో సెట్ అవ్వబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. విక్టరీ వెంకటేష్, నేచురల్ స్టార్ నాని కలిసి నటించబోతున్నారని.. ఈ సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కిస్తాడని ప్రచారం జరుగుతుంది. అల.. వైకుంఠపురములో లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత ఇప్పుడు ఎన్టీఆర్ హీరోగా కథ సిద్ధం చేసాడు.

ఇదే ఏడాది సినిమా పట్టాలెక్కనుంది. ఈ సినిమా తర్వాత నాని, వెంకటేష్ హీరోలుగా మల్టీస్టారర్ చేస్తాడని తెలుస్తుంది. పైగా అది మల్లీశ్వరి, నువ్వు నాకు నచ్చావ్ తరహాలో పూర్తి స్థాయి కామెడీ ఎంటర్‌టైనర్ అని ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే హారిక హాసిని దగ్గర వెంకటేష్ డేట్స్ ఉన్నాయి.. దాంతో పాటు త్రివిక్రమ్ అడిగితే నాని కాదంటాడా.. ఒప్పుకున్న సినిమాలు కూడా పక్కనబెట్టి మరీ వచ్చేస్తాడు. పైగా నానికి హారిక హాసినితో మంచి రిలేషన్ ఉంది. దాని జూనియర్ సంస్థ అయిన సితార ఎంటర్ టైన్మెంట్స్ నుంచే జెర్సీ లాంటి సినిమా వచ్చింది. మొత్తానికి అన్నీ కుదిరి వెంకీ, నాని లాంటి నటులతో కామెడీ ఎంటర్ టైనర్ పడిందంటే మాత్రం థియేటర్స్ లో కడుపులు చెక్కలవ్వడం ఖాయం. ఈ సినిమా 2022లో వస్తుందని తెలుస్తుంది. 

 

More Related Stories